ఆయ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: March 7, 2024   |   Posted By:

ఆయ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ఆయ్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ఆయ్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సిినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ఈ క్రమంలో గురువారం రోజున మేకర్స్ ఆయ్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే నార్నే నితిన్ తన స్నేహితులతో కనిపిస్తున్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ ఇందులో హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో నటించారు. మరో వైపు పచ్చదనంతో కూడిన సరస్సుని కూడా చూపిస్తున్నారు. అంటే ఈ చిత్రంలో ప్రకృతి కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

ఆయ్ అనే టైటిల్‌ను గమనిస్తే ఇది గోదావరి ప్రాంతవాసులు సాధారణంగా వాడే ఓ పదం. ఈ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌ను గమనిస్తుంటే అందమైన గోదావరి యొక్క నేపథ్యానికి వ్యతిరేకంగా ఆకర్షణీయమైన కథనాన్ని తెలియజేస్తోంది. ఈ ఆయ్ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. డ్రిజ్‌లింగ్ సమ్మర్ అంటూ రిలీజ్ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోవటమే కాదు, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఉంటుందని తెలియజేస్తోంది.

ఫన్ రైడర్‌గా తెరకెక్కుతోన్న ఆయ్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేశారు. అలాగే సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జయిటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు :

నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ : GA2 పిక్చర్స్
నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
డైరెక్టర్ : అంజి కంచిపల్లి
సినిమాటోగ్రఫీ : సమీర్ కళ్యాణి
సంగీతం : రామ్ మిర్యాల
ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్