ఆహాలో భామాకలాపం 2 వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Published On: January 18, 2024   |   Posted By:

ఆహాలో భామాకలాపం 2 వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ఆహాలో పసందైన విందులాంటి ఒరిజినల్ భామాకలాపం 2 ఆకట్టుకుంటోన్న ఫస్ట్ గ్లింప్స్

జనవరి 18, హైదరాబాద్: వన్ అండ్ ఓన్లీ 100 % తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెంబర్ వన్ లోకల్ ఓటీటీ మాధ్యమంలో ఒరిజినల్ భామాకలాపం ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన స్నీక్ పీక్‌ను మేకర్స్ అందించారు. ప్రియమణి, శరణ్య సస్పెన్స్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో భామాకలాపం 2పై ఆసక్తిని పెంచింది. అనుపమ పాత్రలో ప్రియమణి అమాయక ఇల్లాలుగా మెప్పించనుంది. శరణ్య పాత్రధారితో కలిసి సాహసంగా దోపిడీని ఎలా చేసిందనేది దాన్ని భామాకలాపం2లో ఆసక్తికరంగా చూపించబోతున్నారనేది అర్థమవుతుంది. అసలు ప్రియమణి పాత్రకు దోపిడీకి సంబంధమేంటనే ఆసక్తిని ప్రేక్షకుల్లో మరింతగా పెంచారు.

విజనరీ డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దాన్ని మించిన థ్రిల్లింగ్ కంటెంట్‌ను భామాకలాపం 2తో ఎవరూ ఊహించనంత రీతిలో అందించబోతున్నట్లు స్నీక్ పీక్ ద్వారా తెలియజేశారు. స్నీక్ పీక్ ద్వారా ఒరిజినల్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందోనని ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రొడక్షన్ స్కేల్ ఓటీటీ ప్రొడక్షన్స్ ప్రామాణికతను పునర్వించేలా కనిపిస్తోంది.

డ్రీమ్ ఫార్మర్స్, బాపినీడు.బి, సుదీర్ ఈదర కలయికలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామాకలాపం, విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు థియేట్రికల్‌గా, ఓటీటీ పరంగా తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ప్రేక్షకులకు మరోసారి గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి భామాకలాపం 2తో అందించబోతున్నారు.

భామకలాపం 2 విషయానికి వస్తే సినిమా అందరిలోనూ ఆసక్తిని పెంచింది. మంచి తారాగణం, చక్కటి కథాంశం దీనికి కారణాలుగా చెప్పొచ్చు. డ్రీమ్ ఫార్మర్స్, బాపినీడు, సుధీర్ ఈదరలతో పాటు ఆహా రూపొందిస్తోన్న ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో మెప్పించనుంది. ఇంకా ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్‌వార్, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే భామాకలాపం 2 వంటి సెన్సేషనల్ ఒరిజనల్‌తో థియేటర్స్‌లో సందడి చేయటానికి సిద్ధంగా ఉండండి.