ఇది కల కాదు చిత్రం ఊర్వశి ఓటిటి విడుదల

Published On: May 10, 2021   |   Posted By:
ఇది కల కాదు చిత్రం ఊర్వశి ఓటిటి విడుదల
 
ఇది కల కాదు ‘ఊర్వశి’ ప్రేక్షకులకు ప్రత్యేకం
 
అదీబ్ నజీర్ స్వీయ నిర్మాణంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం “ఇది కల కాదు”.
 
సీనియర్ నటులు బెనర్జీ, షఫీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందింది. శ్రీజ, మనీష, దానిక, మాధవి, సుప్రియ, పూజిత జొన్నలగడ్డ ఇతర పాత్రలు పోషించారు.
 
ఈ చిత్రం ఈనెల 14 నుంచి ఊర్వశి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా అదీబ్ నజీర్ మాట్లాడుతూ… “కరోన కారణంగా థియేటర్స్ లో కాకుండా  ఊర్వశి ఓటిటి లో మా ‘ఇది కల కాదు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. వైవిధ్యమైన వినోదం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం అమితంగా అలరిస్తుంది” అన్నారు.     
 
ఈ చిత్రానికి సంగీతం: వెంకటేష్ బొల్లా, ఛాయాగ్రహణం: వి.సత్యానంద్, కూర్పు: నగేష్,నిర్మాణం-దర్శకత్వం: అదీబ్ నజీర్