ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ – మూవీ వెర్స్ బ్యానర్ కొత్త సినిమా ప్రారంభం

Published On: April 19, 2024   |   Posted By:

ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ – మూవీ వెర్స్ బ్యానర్ కొత్త సినిమా ప్రారంభం

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, సజీవ్ ఎఆర్, ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ న్యూ మూవీ అనౌన్స్డ్, అక్టోబర్‌లో థియేట్రికల్ రిలీజ్

ఇప్పటికే పలు చిత్రాలలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ కలిసి ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఈరోజు (ఏప్రిల్ 19) హీరోయిన్ ఈషా రెబ్బా పుట్టినరోజును సెట్స్‌ లో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది. యూనిట్ విడుదల చేసిన స్టిల్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రూరల్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. తరుణ్ ఫార్మల్ డ్రెస్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండగా, ఈషా సంప్రదాయ చీరను ధరించింది.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రానికి దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్ రైటర్.

తారాగణం :

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజు విజయ్

సాంకేతిక సిబ్బంది :

దర్శకత్వం సజీవ్ ఏఆర్
నిర్మాతలు సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ
బ్యానర్స్ S ఒరిజినల్స్ & మూవీ వెర్స్
సంగీతం జై క్రిష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ దీపక్ యెరగరా