ఒకే ఒక జీవితం చిత్రం ప్రోమో విడుద‌ల‌

Published On: July 16, 2021   |   Posted By:

ఒకే ఒక జీవితం చిత్రం ప్రోమో విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, శ్రీ కార్తిక్‌, డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ `ఒకే ఒక జీవితం` ప్రోమో విడుద‌ల‌

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్ కెరీర్‌లో రూపొందుతోన్న 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`.
ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్  ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా  రూపొందుతున్న‌ ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రోజు ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది  పాత్ర‌కి సంభందించి ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదీని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్‌ట్రూమెంట్స్ ని చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయించడం మ‌నం చూడొచ్చు. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా  ఉంది.

శ‌ర్వానంద్ స‌ర‌స‌న మ‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం.

జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా `డియ‌ర్ కామ్రెడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు.

ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో శ‌ర్వానంద్‌కు మంచి  ఫాలోయింగ్ ఉంది. సైన్స్ ఫిక్ష‌న్  ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇప్ప‌టికే `ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది`. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

తారాగ‌ణం: శ‌ర్వానంద్‌, రీతు వ‌ర్మ‌, అమ‌ల అక్కినేని, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, నాజ‌ర్‌

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ కార్తిక్‌
నిర్మాత‌లు:ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు
బ్యాన‌ర్‌:  డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
మాట‌లు: త‌రుణ్ భాస్క‌ర్‌
డిఓపి:  సుజిత్ సారంగ్‌
సంగీతం:  జేక్స్ బిజోయ్‌
ఎడిట‌ర్‌: శ్రీ‌జీత్ సారంగ్‌
ఆర్ట్‌: ఎన్‌. స‌తీష్ కుమార్‌
స్టంట్స్‌:  సుదేశ్ కుమార్‌
లిరిక్స్‌:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కృష్ణ‌కాంత్‌