ఒక్కసారి ప్రేమించాక మూవీ ట్రైలర్ విడుదల

Published On: October 19, 2023   |   Posted By:

ఒక్కసారి ప్రేమించాక మూవీ ట్రైలర్ విడుదల

లవ్ యాక్షన్ డ్రామా ఒక్కసారి ప్రేమించాక ట్రైలర్ విడుదల

ఎస్.ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో శ్రీకాంత్ ఆరోల్ల దర్శకత్వంలో భాస్కర్ యాదవ్, లక్ష్మీ హీరో హీరోయిన్లుగా చంగల కుమార్ యాదవ్ నిర్మాతగా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా ఒక్కసారి ప్రేమించాక. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు టి.ప్రసన్న కుమార్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ
మంచి సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి అదే తరహాలో ఒక్కసారి ప్రేమించాక విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ
ఒక మంచి కథ కథనాలతో తెరకెక్కిన ఒక్కసారి ప్రేమించాక సినిమా నవంబర్ 3న విడుదలై చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని నిర్మాత కుమార్ యాదవ్ గారు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్న అన్నారు.

హీరో భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ
నన్ను నమ్మి మా నాన్న గారు కుమార్ యాదవ్ ఈ సినిమాను తీశారు. డైరెక్టర్ శ్రీకాంత్ గారు సినిమాను బాగా తీశారు. మీ అందరికి మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

నిర్మాత చంగాల కుమార్ యాదవ్ మాట్లాడుతూ
ఒక్కసారి ప్రేమించాక సినిమా స్టోరీ నచ్చి ఈ సినిమాలో మా అబ్బాయి బన్నీ యాదవ్ ను హీరోగా పెట్టి సినిమా తీయడం జరిగింది. అందరూ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ కష్టపడి చేశారు. మంచి సినిమా తీశానన్న ఆనందం ఉందని తెలిపారు.

నటీనటులు:

భాస్కర్ యాదవ్, లక్ష్మీ, మొగలయ్యా, సుమన్ శెట్టి, సత్యనారాయణ వద్దాడి, యాదగిరి, అశోక్ పవర్, రాజేష్ ఏ, సుజాత, దివ్య, ధను శ్రీ, సూచిత్ర, నాగన్న, తదితరులు

సాంకేతిక నిపుణులు:

బ్యానర్:ఎస్.ఎల్.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: చెంగల కుమార్ యాదవ్, ఎండి.అబుబాకర్
దర్శకత్వం: శ్రీకాంత్ ఆరోల్ల
కెమెరామెన్స్: సాదిక్ ఎం.డి, ఎం.వి.గోపి
ఎడిటర్: కె.ఆర్.స్వామి
సంగీతం: శ్రీకాంత్ రమణ