ఓదెల రైల్వే స్టేషన్ మూవీ రివ్యూ

Published On: August 26, 2022   |   Posted By:
ఓదెల రైల్వే స్టేషన్ మూవీ రివ్యూ
image.png
హెబ్బా పటేల్ “ఓదెల రైల్వే స్టేషన్” రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) 

👍


క్రైమ్…థ్రిల్లర్ చిత్రాలకు ఓటిటిలు అడ్డాగా మారాయి. ఇప్పటికే మళయాళ థ్రిల్లర్స్ చాలా రిలీజ్ చేసిన ఆహా ఓటిటి తెలుగు థ్రిల్లర్స్ పై దృష్టి పెట్టింది. ఆ క్రమంలో లేటెస్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యిన మరో కొత్త చిత్రం “ఓదెల రైల్వే స్టేషన్”. ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజిత పొన్నాడ లు నటించిన ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ చిత్రం మన తెలుగు ఓటిటి యాప్ ఆహా లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం రండి.

స్టోరీ లైన్

సివిల్స్ లో టాపర్ అయిన అనుదీప్(సాయి రోనక్) తన ఐపీఎస్ ట్రైనింగ్ నిమిత్తం ఓదెల కి వెళ్తాడు. అక్కడ  ఓ పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో జాయిన్ అవుతాడు. అన్నాళ్లుగా ప్రశాంతంగా ఉండే ఊరు… వరుస పెట్టి  రేప్ లు , హత్యలతో మారుమ్రోగుతుంది. అవి చేసేవాడి టార్గెట్ .. కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లు. పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. శోభనం జరిగిన మరుసటి రోజే పెళ్లి కూతురిని ఒక సైకో అతి కితారకంగా అత్యాచారం చేసి చంపేయటం దారుణంగా అనిపిస్తుంది. వరుసగా రెండు మర్డర్స్ జరుగుతాయి. సవాల్ గా మారిన ఈ కేసుని  అనుదీప్   ఎలా చేధించాడు ?  ఇంత దారుణమైన సైకో హత్యలు చేస్తున్న కిల్లర్ ఎవరు ? అసలు శోభనం మరుసటి రోజే అమ్మాయిలని ఎందుకు చంపుతున్నాడు ? హెబ్బా పటేల్ పాత్ర ఏమిటి వంటి విషయాలు   తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

సాధారణంగా సైకో కిల్లర్ చిత్రాలు ఒక టెంప్లెట్ ప్రకారం రన్ అవుతూంటాయి. ఒక సైకో…వాడు వరస హత్యలు చేస్తూంటాడు. ఓ మోడల్ ఫాలో అవుతూంటాడు. ఆ హత్యలు వెనక పెద్ద రీజన్స్ ఉండవుప. చాలా సార్లు  సైకో సాటిస్ఫెక్షన్ కోసం ఒకే మోడల్ లో హ‌త్య‌లు చేస్తుంటాడు. అందులో కిక్ వెతుక్కూంటూంటాడు. అలాగే తనని పట్టుకోవాలని చూసే వారికి సవాళ్ళు విసురుతూ ఎంజాయ్ చేసి, చివరికి పట్టుబడతాడు. దాదాపు ఇదే టెంప్లెట్ క్రిందటివారం వచ్చిన హైవే, ఇప్పటి  “ఓదెల రైల్వే స్టేషన్” ఫాలో అయ్యింది.  ఇక్కడున్న వెరైటీ ఏమిటంటే.. ఇదో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సైకో కిల్లింగ్స్. సినిమా ఓపినింగ్స్ కాస్త ఇంట్రస్ట్ గా కథ నడిపారు కానీ ఆ తర్వాత  పెద్దగా ఎలాంటి మలుపులు లేకుండానే కథని నడిపేసారు. దాంతో.. అస‌లు ఇంకేదో ట్విస్టు ఇంకేదో ఉంద‌న్న భ్ర‌మ క‌ల్పిస్తాడు. అయితే చివ‌రి వ‌ర‌కూ ఇంట్రస్ట్ గా చూస్తే అది మన ఆశే తప్ప మరోటి కాదని తేలిపోతుంది.  సైకో చేసే మొదటి రెండు హత్యలు భీభ‌త్సంగా చూపించారు. ఉన్నంతలో ఎమోషన్ ని బాగానే  రాబట్టుకున్నాడు. దానికి తోడు యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పేశారు.  మొదటి నుంచి ఇతర వ్యక్తుల మీదకు అనుమానాలు వచ్చేలా కథనం నడిచినా.. అసలు వ్యక్తి ఎవరన్నది మొదటే ఆడియెన్స్ పసిగట్టేసేలా స్క్రీన్ ప్లే ఉంది.  అయితే  ఉన్నంతలో అతను సైకోలా మారడానికి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఫరవాలేదు అనిపిస్తుంది. అయితే ఇందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రం పరమ బోరింగ్ గా  ఆకట్టుకునేలా సాగదు.. మరీ అంత థ్రిల్లింగ్ గా ఏమీ అనిపించదు. అయితే రన్ టైమ్  చాలా తక్కువ ఉండటం, అది కూడా ఓటీటీలో విడుదల కావడంతో ఓదెల రైల్వే స్టేషన్‌లో ఓకే ఓ సారి చూడచ్చు అనిపిస్తుంది.

టెక్నికల్ గా …

ఈ సినిమా కు పెద్ద ప్లస్ సినిమాటోగ్రఫీ. పెద్ద మైనస్ స్క్రీన్ ప్లే. చాలా చోట్ల లాగ్ గా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. డైరక్షన్ ఓకే ఓకే అన్నట్లుంది. అనూప్ రూబెన్స్ ….సినిమా ఇంటెన్స్ సీన్స్ కు తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. తమ్మిరాజు ఎడిటింగ్ చాలా వరకు సినిమాని రక్షించింది. సంపత్ నంది రైటింగ్ టీమ్ కూడా ఫెయిలైంది.  తక్కువ ఖర్చులోనే తీసినట్టు అనిపించినా.. తెలంగాణ పల్లెను మాత్రం చక్కగా చూపించారు.

నటీనటుల్లో హెబ్బా పటేల్ చాలా బాగా నటించేసింది. ఆమె  చాలా నాచురల్ గా  అనిపిస్తుంది. యాస, భాష, కట్టూబొట్టూ అన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి దగ్గరగా డిజైన్ చేసారు.  తిరుపతి పాత్రలో కనిపించిన వశిష్ట , అనుదీప్ పాత్రలో సాయి రోనక్ ఓకే అనిపించాడు. పూజిత పొన్నాడ చివర్లో కనిపించింది.

బాగున్నవి:
సినిమాటోగ్రఫీ
సంగీతం
కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్

బాగోలేనివి:
కొన్ని ల్యాగ్ సీన్స్
బోర్ కొట్టించే  స్క్రీన్ ప్లే

చూడచ్చా?
హెబ్బా పటేల్ అభిమానులు ఓ లుక్కేయవచ్చు. ఓ సాదా సీదా థ్రిల్లర్ గా నచ్చుతుంది.

నటీనటులు :హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ, గగన్ విహారి, నాగ మహేష్, సురేందర్ రెడ్డి, హారిక, ప్రవణ్య రెడ్డి, దివ్య, నవీన్,
డీవోపీ – సౌందర్ రాజన్. ఎస్
ఎడిటర్ – తమ్మి రాజు
సంగీతం – అనూప్ రూబెన్స్
లిరిక్స్  – కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ – కొలికపోగు రమేష్
స్టంట్స్ – రియల్ సతీష్
కో రైటర్స్ – గణేష్ ఉప్పునూటి, ప్రదీప్ రెడ్డి, శ్రీకాంత్
డైరెక్షన్ టీమ్ – ఆడెపు గిరిరాజ్, ప్రణయ్‌కేతన్ ఈదునూరి
ప్రొడక్షన్ కంట్రోలర్ – ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను), సాధనానందం.
పబ్లిసిటీ డిజైనర్ – రమేష్ కొత్తపల్లి
అసోసియేట్ ఎడిటర్: తారక్
వీఎఫ్ఎక్స్ : ప్రదీప్ పూడి
క్రియేటర్ – సంపత్ నంది
నిర్మాత – కెకె రాధా మోహన్
దర్శకత్వం – అశోక్ తేజ
రన్ టైమ్: :1 Hrs 35 Min
విడుదల తేదీ : ఆగస్టు 26, 2022

Streaming – OTT – Aha