కళ్యాణం కమనీయం మూవీ రివ్యూ 

Published On: January 14, 2023   |   Posted By:

కళ్యాణం కమనీయం మూవీ రివ్యూ 
సంతోష్ శోభన్  ‘కళ్యాణం కమనీయం’ రివ్యూ

Emotional Engagement Emoji
👎

సందట్లో సడేమియా తరహాలో సంక్రాంతి హంగామా మధ్యలో ఓ చిన్న సినిమా దూసుకువచ్చింది. ఆ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఏమో గుర్రం ఎగరా వచ్చు..చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టా వచ్చు. దానికి తోడు బ్యానర్ వాల్యూ ఒకటి కలిసొచ్చింది. ట్రైలర్స్ కూడా బాగున్నాయి. ఈ నేపధ్యంలో టాక్ బాగుంటే పండగ సినిమాలతో పాటు ఈ సినిమాపై కూడా ఓ కన్నేస్తారు. మరి చూడాలనే నమ్మకాన్ని ప్రేక్షకులలో ఈ సినిమా కల్గించిందా…ఎలా ఉంది..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

ఇంజినీరింగ్ చదివి ఖాళీగా ఉన్న శివ (సంతోష్ శోభ‌న్‌) కు ఓ లవర్ శ్రుతి (ప్రియ భ‌వానీ శంక‌ర్‌). ఆమె సాప్ట్ వేర్ జాబ్ చేస్తూంటుంది. దాంతో సంపాదనికి సంసారానికి ఏ సంభందం లేదని, సమస్యలు రావని భావించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. అయితే రాను రాను భార్య చిన్న చిన్న విషయాలకే ఫైర్ అవుతూంటుంది. తప్పులు పట్టుకుంటూంది. ఈ క్రమంలో శివను ఉద్యోగం చెయ్యాల్సిందే అని పట్టుపడుతుంది. దాంతో వేరే దారి లేక అప్పటికి అప్పుడు ఉద్యోగం రాక..కాబ్ డ్రైవర్ గా జీవితం మొదలెడతాడు. కానీ ఇంట్లో సాప్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్తాడు. అయితే అబద్దం ఎన్నాళ్లు మెయింటైన్ చేయగలడు. ఏదో ఒక రోజు బయిటపడాల్సిందే కదా..ఆ రోజు ఎప్పుడు వచ్చింది. చివరకి జీవితం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్…:

జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవు. వేసుకున్న ప్లాన్ లు ఓ రోజు యూటర్న్ తీసుకుంటాయి. అప్పుడు ఏం చేయగలం …ఇగోలతో  ప్రేమ జీవితాలను భగ్నం చేసుకోలేం కదా …అదే డైరక్టర్ చెప్దామనుకున్నాడు. కానీ అనుకున్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. దాంతో ఈ కథ ఓ షార్ట్ ఫిల్మ్ లా మారిపోయింది. మళయాళం వాళ్లు ఇలాంటి చిన్న పాయింట్ ని కూడా ఎంతో ఎంగేజింగ్ గా రెండు గంటలు సేపు చెప్పగలుగుతున్నారు. ఇక్కడ మన వాళ్లు ఫెయిల్ అవుతున్నారు. అందుకు తగ్గ కథా విస్తరణ ,స్క్రీన్ ప్లే చేయలేకపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ గా సినిమాని మొదలెట్టిన డైరక్టర్ ..విషయం లోతుల్లోకి వెళ్లలేక అక్కడే ఆగిపోయాడు. డెప్త్ కు వెళ్లి కాస్త పరిణితో కథ చేస్తే మరో విధంగా ఉండేది. అలాగే కథను కాంప్లిక్ట్స్ లోకు పెట్టే సీన్స్ కూడా బలంగా చేయలేకపోయాడు. అలాగే సహజంగా సినిమా నేరేట్ చేయాలనకున్నాడు కానీ ….అందుకు తగ్గ ప్లాట్ ఫామ్ ని ఏర్పాడు చేయలేకపోయారు. ఫన్ ఉంది కానీ ఎమోషన్ కనెక్ట్ కాలేదు. కొన్ని సీన్స్ లో మరీ డ్రామా ఎక్కువైపోయింది. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.

నటీనటుల్లో

సంతోష్ శోభన్  లో మంచి ఈజ్ ఉంది. మంచి ఎక్సప్రెషన్స్ ఇవ్వగలడు. కానీ అతనికి కథ సపోర్ట్ చేయాలి. ఇక ప్రియ భవాని శంకర్ …  భార్యగా బాగా చేసింది. క్యూట్ గా వుంది. ఆమె పాత్రను బాగా డిజైన్ చేసారు.  మేనేజర్ గా ఉంటూ హీరోయిన్ ని హెరాస్ చేసే పాత్రలో సత్యం రాజేష్ …జీవించాడు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు బాగా చేసారు.

టెక్నికల్ గా …

ఈ సినిమా స్క్రీన్ ప్లే మీద మరింత కసరత్తు చేసి ఉంటే మరింత బాగా ఉండేది. స్క్రిప్టు వైపు నుంచి తప్పిస్తే మిగతా విభాగాలు అన్నీ బాగా చేసాయి. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ ఓ మ్యాజిక్ లా సినిమాని పట్టుకుంది. ఆ కలర్ ఫుల్ విజువల్స్ కు తగ్గట్లే శర్వన్ భరద్వాజ …డెప్త్ గా మ్యూజిక్ ఇచ్చాడు. డైలాగుల్లో చాలా వరకూ అర్దవంతంగా ఉన్నాయి.  నిర్మాణ విలువలు ప్రత్యేకంగా చెప్పేదేముంది. బాగా ఖర్చుపెట్టారు. డైరక్టర్ లో సెన్స్,సెన్సాఫ్ హ్యూమర్ ఉంది కానీ…అతన్ని సపోర్ట్ చేసే స్టోరీ లైన్ లేకపోవటంతో ఎలివేట్ కాలేదు.

చూడచ్చా…

థియేటర్ కు వెళ్లి ఆవేశపడి చూసేటంత గొప్పగా లేదు..ఓటిటి కోసం వెయిట్ చేయచ్చు..

నటీనటులు : సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు
సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని,
ఎడిటర్ – సత్య జి,
సంగీతం – శ్రావణ్ భరద్వాజ్,
సాహిత్యం – కృష్ణ కాంత్,
కొరియోగ్రాఫర్స్ – యష్, విజయ్ పోలంకి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు, ప్రొడక్షన్
డిజైనర్ – రవీందర్,
లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్,
సహ నిర్మాత – అజయ్ కుమార్ రాజు
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్,
రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.
రన్ టైమ్ :  గంట 46 నిమిషాలు
విడుదల తేదీ : 14 జనవరి 2023