కళ్యాణం కమనీయం సినిమా జనవరి 14న విడుదల

Published On: January 9, 2023   |   Posted By:

కళ్యాణం కమనీయం సినిమా జనవరి 14న విడుదల

కళ్యాణం కమనీయం చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్, జనవరి 14న సినిమా విడుదల

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా కళ్యాణం కమనీయం. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో
సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేశారు.

సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే కాన్సెప్ట్ తో రూపొందడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సకుటుంబంగా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేసే మూవీ అనే అభిప్రాయం వారిలో ఏర్పడుతోంది.

నటీనటులు :

సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్

సాంకేతికవర్గం :

సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని
ఎడిటర్ – సత్య జి,
సంగీతం – శ్రావణ్ భరద్వాజ్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్
రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.