Kantara Chapter 1 Movie Review
కాంతారా చాప్టర్ 1 రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
పంజుర్లి జాతర తర్వాత అడవిలో ఒక ప్లేస్ లో మాయమైపోయిన తన తండ్రి గురించి చైల్డ్ శివ ( రిషబ్ శెట్టి) తెలుసుకోవాలనుకొంటాడు. ఆ ప్లేస్ వెనుక దశాబ్దాల చరిత్ర ఉంటుంది. కాంతార ప్రాంతం లో ఈశ్వరుని పూదోట ఉంటుంది. రాజశేఖర్ (జయరాం) తండ్రి ఈశ్వరుని పూదోట ఆక్రమించుకొనే క్రమంలో కాంతారా తెగ వాళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. కులశేఖర (గుల్షన్ దేవయ్య) ఈశ్వరుని పూదోట కావాలనుకొంటాడు. అదే ప్రాంతంలో ఉన్న బెర్మి (రిషబ్ శెట్టి) తన ప్రజల కోసం కులశేఖర రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బెర్మి , కనకావతి (రుక్మిణి వసంత్)కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, బెర్మి తన కాంతార కోసం ఏం చేశాడు ?, అసలు బెర్మి ఎవరు , ఎక్కడ నుంచి వచ్చాడు ?, ఈ మధ్యలో కనకావతి పాత్ర ఏమిటి ?, ఆమె టార్గెట్ ఏమిటి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
అధర్మం జరిగినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి దేవుడు వస్తాడు..
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
కాంతారా అంటే రిషబ్ శెట్టి.. రిషబ్ శెట్టి అంటే కాంతారా అని గుర్తుండి పోయేలా నటించాడు. రిషబ్ శెట్టి డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రిషబ్ శెట్టి మెప్పించాడు. కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.
కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్ చాలా బాగా నటించింది. స్క్రీన్ మీద చాలా అందంగా ఉంది. కులశేఖర పాత్ర లో గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించాడు. రాజుగా జయరాం తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది.
టెక్నికల్ గా :
రిషబ్ శెట్టి డైరెక్షన్ చాలా బాగుంది. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను బాగా చూపించాడు. సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. బి.అజనీష్ లోక్నాథ్ పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నిర్మాత విజయ్ కిరగందూర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
రిషబ్ శెట్టి నటన, డైరెక్షన్ , రుక్మిణి వసంత్ నటన , మిగతా నటీనటులు నటన, యాక్షన్ సీక్వెన్స్ .
మైనస్ పాయింట్స్ :
హీరో ,విలన్ మధ్య స్ట్రాంగ్ ఫైట్ లేకపోవడం.
తీర్పు :
కాంతారా అంటే రిషబ్ శెట్టి.. రిషబ్ శెట్టి అంటే కాంతారా..
నటీనటులు:
రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్,జయరామ్, గుల్షన్ దేవయ్య ,రాకేష్ పూజారి,తదితరులు.
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : ‘ కాంతారా చాప్టర్ 1 ‘
బ్యానర్: Hombale Films
విడుదల తేదీ: 02-10-2025
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకత్వం: రిషబ్ శెట్టి
సంగీతం: బి. అజనీష్ లోక్నాథ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్. కశ్యప్
ఎడిటింగ్: సురేష్ మల్లయ్య
నిర్మాత: విజయ్ కిరగందూర్
రన్టైమ్: 168 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్