కిస్మత్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్

Published On: January 29, 2024   |   Posted By:

కిస్మత్‌ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్

కిస్మత్‌ అందరినీ అద్భుతంగా అలరిస్తుంది. ప్రేక్షకులు తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో కిస్మత్ టీం

నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ కిస్మత్‌. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది.

ప్రీలిజ్ ఈవెంట్ లో అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. కిస్మత్ టీంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు శ్రీనాథ్ గారు చెప్పిన కథ చాలా నచ్చింది. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయంలో క్రెడిట్ అంతా దర్శకుడికి దక్కుతుంది. ఆయన చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఇదొక క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాని థియేటర్ లో చూడకపోవడం క్రైమ్(నవ్వుతూ) తప్పకుండా అందరూ ఫిబ్రవరి 2న సినిమాని థియేటర్స్ లో చూడాలి. శ్రీనివాస్ అవసరాలతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. నరేష్ అగస్త్య, విశ్వ దేవ్ వండర్ ఫుల్ యాక్టర్స్. వారితో కలసి పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. రాజు గారు సినిమా పట్ల ప్యాషన్ వున్న నిర్మాత. అలాగే భానుగారు కూడా చాలా సపోర్ట్ చేశారు. మార్క్ కే రాబిన్ గారు చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. ఈన సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అందరూ సినిమా చూడాలి. సినిమా చాలా యంగేజింగ్ గా వుంటుంది. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అన్నారు

డైరెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ..కరోనా లాక్ డౌన్ సమయంలో నిర్మాత రాజు గారు పరిచయమయ్యారు. దాదాపు ఆరు నెలలు పాటు చాలా కష్టపడి ఈ కథని డెవలప్ చేశాం. కథ అద్భుతంగా వచ్చింది. మా నటీనటులు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ కి ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ అవసరాల గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి. విప్లవ్ చాలా చక్కగా ఎడిట్ చేశారు. మార్క్ కె రాబిన్ సాయి కార్తిక్ గారు అద్భుతమైన మ్యూజిక్ చేశారు. మా నటీనటులు, టెక్నికల్ టీం అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రేక్షకులందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. తప్పకుండా థియేటర్స్ కి రండి చాలా ఎంజాయ్ చేస్తారు అన్నారు

శ్రీనివాస అవసరాల మాట్లాడుతూ.. శ్రీనాథ్ గారు నాకు చాలా నచ్చిన డైరెక్టర్ . చాలా క్లారిటీతో వుంటారు. ఆయనకి లాంగ్ కెరీర్ వుండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాత రాజు గారు చాలా కూల్ గా కాన్ఫిడెంట్ గా వుంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విప్లవ్ గారు అద్భుతంగా ఎడిట్ చేశారు. రాబిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ సూపర్ యాక్టర్స్. వారితో నటించడం మంచి అనుభూతి. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలి అని కోరారు.

విశ్వ దేవ్ మాట్లాడుతూ.. చాలా వినోదాత్మక చిత్రాన్ని నిర్మించిన రాజు గారికి భాను గారికి అభినందనలు. ఇది శ్రీనాథ్ గారి వలన సాధ్యమైయింది. చివరివరకూ యంగేజింగ్ వుండే సినిమా ఇది. అందరూ నటులు అద్భుతమైన తన కనబరిచారు. కన్నుల పండగలా వుండే సినిమా ఇది. అందరినీ అలరించే యూనిక్ కంటెంట్ ఇది. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్ గారితో నటిచడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తప్పకుండా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అన్నారు.

సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. శ్రీనాథ్ చాలా ప్రతిభగల దర్శకుడు. నా మ్యూజిక్ టీం అందరికీ థాంక్స్. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మా కిస్మత్ ప్రేక్షకులు మారుస్తారనే నమ్మకం వుందిఅన్నారు. ఈవేడుకలో తాగుబోతు రమేష్, రచ్చరవి, కాసర్ల శ్యామ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.