కీడా కోలా మూవీ సెకండ్ సింగిల్ విడుదల

Published On: October 27, 2023   |   Posted By:

కీడా కోలా మూవీ సెకండ్ సింగిల్ విడుదల

తరుణ్ భాస్కర్ దాస్యం, రానా దగ్గుబాటి, విజి సైన్మా కీడా కోలా సెకండ్ సింగిల్ కయ్యాల చిందాట పాట విడుదల

తన తొలి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలాతో వస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది.

ఫస్ట్ సింగిల్ డిపిరి డిపిరి పాటకు టెర్రిఫిక్ రెస్పాన్స్ రావడంతో చార్ట్ బస్టర్ నోట్ లో కీడా కోలా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ కయ్యాల చిందాట పాటని ఇప్పుడు విడుదల చేశారు మేకర్స్.

కయ్యాల చిందాట పాటని మాస్ ని రిడిఫైన్ చేస్తూ హై ఎనర్జీ అండ్ రేసింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు వివేక్ సాగర్. పాటలో మాస్ వైబ్రెన్స్ అవుట్ స్టాండింగ్ గా వుంది. నిక్లేష్ సుంకోజీ అందించిన లిరిక్స్ యూనిక్ అండ్ క్యాచిగా వున్నాయి. హేమచంద్ర వాయిస్ పాటకు మరింత మాస్ పంచ్ ని తీసుకొచ్చింది. మొత్తానికి ఈ పాట కీడా కోలాపై మరింత క్యురియాసిటీని పెంచింది.

విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్.

కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

తారాగణం :

బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, తరుణ్ భాస్కర్, చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్ తదితరులు

సాంకేతికవర్గం :

రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్ దాస్యం
ప్రొడక్షన్ హౌస్ – విజి సైన్మ
నిర్మాతలు: కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్ & ఉపేంద్ర వర్మ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటర్: ఉపేంద్ర వర్మ