కీర్తి సురేష్ కొత్త చిత్రం ప్రారంభం

Published On: July 17, 2023   |   Posted By:

కీర్తి సురేష్ కొత్త చిత్రం ప్రారంభం

కీర్తి సురేష్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, గణేష్ రాజ్, తెలుగు-తమిళ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్- గ్రాండ్ గా జరిగిన పూజా కార్యక్రమం

ఒకే ఒక జీవితం, సుల్తాన్, ఖైదీ, ఖాకీ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాల అందించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తెలుగు-తమిళ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్‌ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు గణేష్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఫిమేల్ ఒరింయంటెడ్ కథ ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు, టర్న్‌లు, అత్యుత్తమ సాంకేతికతతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వనుంది. కీర్తి సురేష్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులు, అభిమానులని అలరించనున్నారు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. కీర్తి సురేష్, నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, దర్శకుడు గణేష్ రాజ్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాధేష్ మాణికం సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి మణికంద బాలాజీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ శక్తీ వెంకట్‌రాజ్, యాక్షన్ డైరెక్టర్ గా పీసీ స్టంట్స్ పని చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్‌ఆర్‌ప్రబు మాట్లాడుతూ.. ఈ చిత్రం థ్రిల్లింగ్‌ కథనం, అత్యుత్తమ సాంకేతికతతో సరికొత్త అనుభూతిని ఇస్తూ అందరినీ అలరిస్తుంది అన్నారు.