ఖుషి చిత్రంసెకండ్ సింగిల్ సాంగ్ విడుదల పోస్టర్

Published On: July 11, 2023   |   Posted By:

ఖుషి చిత్రంసెకండ్ సింగిల్ సాంగ్ విడుదల పోస్టర్

ఆసక్తిరేకెత్తిస్తోన్న విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ సెకండ్ సింగిల్ ‘ఆరాధ్య’ సాంగ్ పోస్టర్
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ మేకర్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  విజయ్, సమంత ల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. లవ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీని తీయడంలో శివ నిర్వాణ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఖుషి చిత్రం నుంచి ఆరాధ్య అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటిస్తూ మేకర్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత, విజయ్‌లు ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోమవారం నాడు, పాటను బుధవారం నాడు విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు.
ఇప్పటికే ‘నా రోజా నువ్వే’ అనే పాటు యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ ‘ఆరాధ్య’తో మరో సారి ‘ఖుషి’ సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్  మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. సెప్టెంబర్ 1న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్:
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  : దినేష్ నరసింహన్
ఎడిటర్  : ప్రవీణ్ పూడి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు  : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం  : శివ నిర్వాణ.