గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ప్రారంభం

Published On: January 8, 2024   |   Posted By:

గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ప్రారంభం

గీతాంజలి మళ్ళీ వచ్చింది పై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారో దాన్ని మించేలా ఎంజాయ్ చేస్తూ 100 శాతం శాటిస్పై అవుతారు చిత్ర సమర్పకుడు కోన వెంకట్

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేసే ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో…

ఎడిటర్ చోటా కె.ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో క్యారెక్టర్స్ భయపడుతుంటే మనం నవ్వుతుంటాం. మూవీలోని క్యారెక్టర్స్ నవ్వుతుంటే మనం భయపడుతుంటాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది అన్నారు.

సినిమాటోగ్రఫీ సుజాత సిద్ధార్థ్ మాట్లాడుతూ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో అవకాశం ఇచ్చిన కోన వెంకట్ గారికి థాంక్స్. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ మీకొక కొత్త ఎక్స్‌పీిరియెన్స్ ఇస్తుంది. డైరెక్టర్ శివ తుర్లపాటిగారు సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. అందరికీ థాంక్స్ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు అవుతున్నాయి. నా తొలి సినిమా గీతాంజలి. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు కూడా వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నాను. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన కోన వెంకట్‌గారికి థాంక్స్. నాకెంతో సన్నిహితుడైన డైరెక్టర్ శివ తుర్లపాటిగారు నాపై చాలా పెద్ద బాధ్యతను ఉంచారు. సినిమాలో థీమ్ సాంగ్‌తో కలిపి నాలుగు సాంగ్స్ ఉన్నాయి అన్నారు.

రవి క్రిష్ణ మాట్లాడుతూ పదేళ్ల క్రితం నేను కామన్ ఆడియెన్‌గా గీతాంజలి సినిమాను ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సీక్వెల్‌లో మంచి రోల్ చేయటం మరచిపోలేని అనుభూతి.విరూపాక్షలో నా నటనకు ప్రేక్షకులనుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఆ ప్రేమాభిమానాలను మరచిపోలేను. కోన వెంకట్ గారికి థాంక్స్. అంజలిగారు, శ్రీనివాస్ రెడ్డిగారితో వర్క్ చేయటం బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాం అన్నారు.

డైరెక్టర్ శివ తుర్లపాటి మాట్లాడుతూ కోన వెంకట్‌గారు నాపై నమ్మకంతో నాకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆయన్ని ఎప్పటికీ మరచిపోలేను. గీతాంజలి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సీక్వెల్‌ చేయటానికి కొత్త డైరెక్టర్ అవకాశం ఇచ్చిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్. అంజలిగారు, శ్రీనివాస్ రెడ్డి సహా అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేశారు. సుజాత సిద్ధార్థ్, ప్రవీణ్ లక్కరాజు నా పనిని ఇంకా సులభతరం చేశారు. అందరికీ థాంక్స్ అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గీతాంజలి మళ్ళీ వచ్చింది కథ వినగానే థ్రిల్ అయ్యాను. సినిమా నవ్విస్తూ భయపెట్టిస్తూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ విజువల్స్ తో మాయ చేశారు. మూవీలో అంజలి, గీతాంజలి కాంబినేషన్‌ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. అలీ, సునీల్ ఇలా చాలా మంచి టీమ్ వర్క్ చేసింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం పెద్ద ఎస్సెట్ అవుతుంది. కోనగారికి థాంక్యూ వెరీ మచ్. ఈ గీతాంజలి ఇలాగే ప్రేక్షకులను మెప్పించటానికి మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ సాధారణంగా మనకు సముద్రంలో ముత్యాలు దొరుకుతుంటాయి. అలా నాకు అమెరికాలో దొరికిన ఆణిముత్యాలు ప్రవీణ్ లక్కరాజు, శివ తుర్లపాటి, మా లిరిసిస్ట్ శ్రీజో వంటి వారు దొరికారు. నేను షార్ట్ ఫిలిమ్ చేసినప్పుడు నాకు శివ తుర్లపాటి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తనతో జర్నీ చేస్తున్నాను. గీతాంజలి సినిమా చేసే సమయానికి నేను 45 సినిమాలకు వర్క్ చేసి ఉన్నాను. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనిపించి చేసిన సినిమాయే గీతాంజలి. శ్రీనివాస్ రెడ్డి నా దగ్గరకు రాజ్ కిరణ్‌ని తీసుకొచ్చాడు. హారర్ మూవీగా ఉన్న ఆ కథను కామెడీ హారర్‌గా మార్చాను. ఆ సమయంలో బలుపు సినిమాలు రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆ మూవీలో కీలక పాత్ర చేసిన అంజలి పెర్ఫామెన్స్ నచ్చటంతో గీతాంజలి సినిమా కోసం అప్రోచ్ అయ్యాం. అలా సినిమా టేకాఫ్ అయ్యింది. గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. గీతాంజలి మూవీ చేయటానికి మరో కారణం ఎంవీవీ సత్యనారాయణగారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ అందరూ ఎంతో ఇష్టంగా చేసిన సినిమా గీతాంజలి. సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది విషయానికి వస్తే సుజాత సిద్ధార్థ్ ఎంతో అడ్వాంటేజ్ అయ్యారు. అలాగే ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఎసెట్ అయ్యింది. ఈ సీక్వెల్ రావటానికి పదేళ్లు పట్టింది. గీతాంజలి 2ను అమెరికాలో చేద్దామని అనుకున్నాను. కానీ టెక్నికల్, ప్రాక్టికల్ అంశాల కారణంగా సినిమాను ఊటీకి మార్చి చేశాం. సత్య, సునీల్, రవిక్రిష్ట, రాహుల్ మాధవ్, అలీ సినిమాకు అడిషన్స్ అయ్యారు. సినిమాను ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఆడియెన్స్ చూడటానికి వస్తారో దాన్ని మించి ఎంజాయ్ చేస్తారు. భాను కిరణ్, నందు రైటింగ్ పరంగా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. సినిమాను అందరూ ఎంజాయ్ చేసి చేశారు. మా శివకు గీతాంజలి మళ్ళీ వచ్చింది చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. తను టాలీవుడ్‌లో ఫెంటాస్టిక్ డైరెక్టర్‌గా నిలుస్తారు. సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

అంజలి మాట్లాడుతూ గీతాంజలి నా కెరీర్‌లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తోనే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చేశాం. సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. సినిమా చూశాను. చాలా బావుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే .. క్లైమాక్స్ మరో రేంజ్‌లో ఉంటుంది. విజువల్, గ్రాండ్ నెస్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటాయి. సీక్వెల్‌లో పార్ట్ 2 వెయిట్ ను మోయటానికి స్టార్ క్యాస్ట్ పెరిగింది. అలీ, సునీల్, సత్య ఇలా అందరూ నవ్విస్తారు. డైరెక్టర్ శివ తుర్లపాటిగారికి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ విజువల్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, రాజేష్ నా కోస్టార్స్‌గా పార్ట్ 1లో నటించారు. సీక్వెల్‌లోనూ నవ్విస్తారు. మూవీకోసం గ్రేట్ సెట్ వేసి శ్రీనుగారు, అద్భుతమైన సంగీతాన్ని అందించిన ప్రవీణ్ లక్కరాజుగారు, ఎడిటర్ చోటాగారు అద్భుతంగా చేశారు. గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు భయపెడతాయి. వాటిని థియేటర్స్ లో చూడాల్సిందే. కోన వెంకట్ గారు గీతాంజలి చిత్రాన్ని ఫ్రాంచైజీగా రూపొందిస్తూ గీతాంజలి మళ్ళీ వచ్చింది చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది అన్నారు.

నటీనటులు:

అంజ‌లి, శ్రీనివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం :

బ్యాన‌ర్స్‌:ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
నిర్మాత‌లు: ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ
ద‌ర్శ‌క‌త్వం: శివ తుర్ల‌పాటి
సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
కెమెరా: సుజాత సిద్ధార్థ్
ఎడిట‌ర్‌: చోటా కె ప్ర‌సాద్‌