ఘోస్ట్ మూవీ నవంబర్ 4 విడుదల

Published On: October 30, 2023   |   Posted By:

ఘోస్ట్ మూవీ నవంబర్ 4 విడుదల

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ బ్లాక్ బస్టర్ ఘోస్ట్ ఆంధ్ర, తెలంగాణ లో నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన యాక్షన్ స్పెక్టకిల్ ఘోస్ట్ కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్ల తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ లో విడుదలైన ఘోస్ట్, తొలి రోజే టెర్రిఫిక్ రివ్యూస్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కించారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఘోస్ట్ నవంబర్ 4న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రమంతటా తెలుగు లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేసిన ఘోస్ట్ ట్రైలర్ కి ట్రేమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే బ్లాక్ బస్టర్ జైలర్ లో పవర్ ఫుల్ స్పెషల్ రోల్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శివరాజ్ కుమార్, పూర్తి స్థాయిలో యాక్షన్ హీరోగా నటించిన ఘోస్ట్ పట్ల తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ అందించగా. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందించారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ఘోస్ట్ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేశారు.

క్యాస్ట్ :

డాక్టర్ శివరాజ్ కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న మరియు తదితరులు

టెక్నీషియన్స్:

ప్రొడక్షన్ హౌస్: సందేశ్ ప్రొడక్షన్స్ (31 వ చిత్రం)
నిర్మాత: సందేశ్ ఎన్.
కథా, దర్శకత్వం: శ్రీని
సంగీతం: అర్జున్ జన్య
సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్