చంద్రముఖి 2 మూవీ సెప్టెంబర్ 15 రిలీజ్

Published On: September 4, 2023   |   Posted By:

చంద్రముఖి 2 మూవీ సెప్టెంబర్ 15 రిలీజ్

ఆస‌క్తిగా రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ మూవీ చంద్రముఖి 2 ట్రైలర్ – వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న మూవీ గ్రాండ్ రిలీజ్

రాజాధిరాజ రాజ గంభీర‌ రాజ మార్తాండ‌ రాజ కుల తిల‌క అంటూ వేట్ట‌య రాజా వేంచేయ‌నున్నారు. 17 సంవత్స‌రాల క్రితం చంద్ర‌ముఖి తన బందీగా ఉంటున్న గ‌ది త‌లుపులు తెరుచుకుని వేట్ట‌య రాజాపై ప‌గ తీర్చుకోవ‌టానికి ప్రయ‌త్నించి విఫ‌ల‌మైంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి వ‌చ్చేస్తోంది. అదెప్పుడు ఎక్క‌డ‌ ఎలా అనేది తెలుసుకోవాలంటే సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ చంద్రముఖి 2. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రముఖి 2 చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం చిత్ర యూనిట్ చంద్రముఖి 2 ట్రైల‌ర్ విడుద‌ల చేసింది.

ట్రైల‌ర్‌లో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒక‌టి స్టైలిష్ లుక్ కాగా మ‌రోటి వేట్ట‌యా రాజా లుక్‌. ఇక చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగనా ర‌నౌత్ ఒదిగిపోయింది. ఇక బ‌స‌వ‌య్య పాత్ర‌లో స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు త‌న‌దైన కామెడీతో మెప్పించ‌బోతున్నారు. సినిమాలోని హార‌ర్‌, థ్రిల్లింగ్, కామెడీ అంశాల‌ను చూపించారు. ప్ర‌తీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెర‌కెక్కించారు. న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం, నేప‌థ్య సంగీతం, ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అల‌రించ‌నున్నాయ‌ని ట్రైల‌ర్ చూస్తుంటే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ట్రైల‌ర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతోంది. చంద్ర‌ముఖి 2తో డైరెక్ట‌ర్ పి.వాసు సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ‌రోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయ‌బోతున్నారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

న‌టీన‌టులు:

రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్‌, వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: పి.వాసు
బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్‌
మ్యూజిక్‌: ఎం.ఎం.కీర‌వాణి
ఎడిట‌ర్‌: ఆంథోని