చిత్రల‌హ‌రి చిత్రం ఏప్రిల్ విడుద‌ల‌

Published On: January 16, 2019   |   Posted By:

చిత్రల‌హ‌రి చిత్రం ఏప్రిల్ విడుద‌ల‌

ఏప్రిల్ 12న సాయిధ‌ర‌మ్ తేజ్‌, కిషోర్ తిరుమ‌ల,  మైత్రీ మూవీ మేక‌ర్స్  `చిత్రల‌హ‌రి` విడుద‌ల‌

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ – “కిషోర్ తిరుమల సినిమా అంటే కూట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి.అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతోంది. షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లోకిషోర్ తిరుమ‌ల‌గారు ప్రెజంట్ చేస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను  ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లచేయాల‌నుకుంటున్నాం“ అన్నారు. 

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ – “మంచి ఎమోష‌న‌ల్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రల‌హ‌రి తెర‌కెక్కుతోంది. టైటిల్‌లో ఐదు అక్ష‌రాలుఉన్న‌ట్లు సినిమాలో ఐదు క్యారెక్ట‌ర్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంటాయి. సినిమా ఈ పాత్ర‌ల చుట్టూ ఎక్కువ‌గా తిరుగుతుంది. సాయిధ‌ర‌మ్ తేజ్కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది“ అన్నారు. 

                                         సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  దేవిశ్రీప్ర‌సాద్‌, ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.