చేరువైన దూరమైన చిత్రం టైటిల్  పోస్టర్ రిలీజ్

Published On: June 8, 2020   |   Posted By:

చేరువైన దూరమైన చిత్రం టైటిల్  పోస్టర్ రిలీజ్

తలసాని చేతుల మీదుగా చేరువైన దూరమైన  టైటిల్  పోస్టర్ రిలీజ్

సీనియర్  నటుడు, కమెడియన్ మరియు దర్శకుడు , శ్రీనివాస్  రెడ్డి మేన అల్లుడు  అయిన సుజిత్ రెడ్డి ను హీరోగా పరిచయం చేస్తూ వినాయక ఎంటర్టైన్మెంట్స్  ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది. కే. యస్, ఎన్  చందు   దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తరుణిక సింగ్  కథానాయిక.

ఈ చిత్రం గురించి దర్శకుడు కే. యస్. ఎన్.   చందు మాట్లాడుతూ ” చేరువైన దూరమైన  ప్రేమకధ ఇది. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ హీరో  ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. ప్రేమకథా చిత్రాల్లో విభిన్నంగా ఉంటుంది”” ఇది ఈ మధ్య కాలం లో పరువు హత్యల నేపధ్యం లో రియల్ ఇన్సిడెంట్ అని చెప్పవచ్చు  అని తెలిపారు.

వినాయక ఎంటర్టైన్మెంట్స్  అధినేత కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్  ఇద్దరు  మాట్లాడుతూ ” చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. సెన్సార్ కూడా రెడీ గా ఉంది. హైదరాబాద్, మరియు ఆంధ్ర  పరిసర ప్రాంతాల్లో నిర్మాణం జరిగింది. ఈ రోజు గౌరవనీయులయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  గారి చేతుల మీదుగా మా బ్యానర్ లోగో మరియు  టైటిల్  పోస్టర్ రిలీజ్ చేయటం చాల సంతోషం గా ఉంది . రెండు పోస్టర్స్ ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది . లాక్ డౌన్ పూర్తియ్యాక సినిమాను విడుదల చేస్తాం” అని తెలిపారు.

ఆర్టిస్ట్  మరియు  కమెడియన్  శ్రీనివాస్  రెడ్డి మాట్లాడుతూ ఈ కథ నాకు  తెలుసు చాల బాగుంది . ఈ చిత్రం మంచి విజయం  సాదించాలి  అని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను. టీం  అందరికి  అల్ ది బెస్ట్ .

సుజిత్ రెడ్డి , తరుణిక సింగ్, జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేశ్వరి నాయర్ , బెనర్జీ , మణిచందన ,దేవిశ్రీ ,నవీనరెడ్డి,శశి కుమార్,  తదితరులు ఇతర ముఖ్యతారాగణం.

సంగీతం సుకుమార్ పమ్మి , పీఆర్వో : శ్రీ , ఛాయాగ్రహణం శివ కృష్ణ కే యస్ , ఎడిటర్ అనిల్ జల్లు , దర్శకత్వం కే. యస్.ఎన్ .చందు ,ప్రొడ్యూసర్స్ :  కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్