జపాన్ మూవీ డబ్బింగ్ ప్రారంభం

Published On: September 14, 2023   |   Posted By:

జపాన్ మూవీ డబ్బింగ్ ప్రారంభం

కార్తి, రాజు మురుగన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ జపాన్ డబ్బింగ్ ప్రారంభం

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ జపాన్ చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదివరకే కార్తీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి. కార్తి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా వున్నాయి. కార్తి డబ్బింగ్ చెబుతుంటారు. కానీ టేక్ ఎంతకీ ఓకే అవ్వదు. చివరికి టైటిల్ రోల్ జపాన్ గెటప్ తో వచ్చి చెప్పడంతో ఓకే అవుతుంది. ఈ వీడియో, ముఖ్యంగా జపాన్ పెక్యులర్ వాయిస్, లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది. యూనిక్ కాన్సెప్ట్ తో ఈ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తి డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు.

కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు.

జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

దీపావళికి ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

తారాగణం :

కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌, సునీల్, విజయ్ మిల్టన్

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: రాజు మురుగన్
నిర్మాతలు: ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్