జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

Published On: April 8, 2024   |   Posted By:

జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

హైదరాబాద్: జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ హరిహర కళాభవన్ లో ఘనంగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 శాఖలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డ్స్ అందించి సత్కరించారు.  ఈ కార్యక్రమంలో బింబిసారా దర్శకుడు వశిష్ట, కొరియోగ్రాఫర్  ప్రేమ్ రక్షిత్, నటులు మురళీధర్ గౌడ్, అజయ్ ఘోష్, రచ్చ రవి, మాణిక్, హీరోయిన్ నేహా రెడ్డి, నటులు ప్రొడ్యూసర్ ముసఅలీఖాన్, సీనియర్, నటులు అర్జున్ రాజు, తిరుపతి దొరయ్, రెజ్లర్ భువనేశ్వరి అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

బింబసారా  డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. తాను చేసిన బింబిసారా మూవీకి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్స్ రావడం చాలా సంతోషం ఉందని.. ఈ అవార్డ్ ప్రధానం చేసిన “జోష్” సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్  మాట్లాడుతూ… RRR సినిమాలో నాటు నాటు పాటకు గాను ఈ అవార్డ్స్ తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి.. ఈ అవార్డ్స్ ప్రధానం చేసిన “జోష్” నేషనల్ ఫిల్మ్ అకాడమీ చైర్మన్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఇతర కళాకారులను ప్రోత్సాహించాలని కోరుకుంటున్నానని అన్నారు.

నటుడు మాణిక్ మాట్లాడుతూ… రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవ్వలేని అవార్డ్స్ ను ఒక సామాన్య పౌరుడు ఒక చిన్న గ్రామము నుండి వచ్చి చిన్న , పెద్ద తేడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నంది అవార్డ్స్ ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు.

నటుడు రచ్చ రవి మాట్లాడుతూ… ఈ అవార్డు రావడం చాలా సంతోషం ఉందని, తనకు ఇంత గౌరవం ఇచ్చిన”జోష్’ అవార్డ్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ… డీజే టిల్లు చిత్రంలో నటించిన బెస్ట్ సపోర్ట్ రోల్ కు గాను “జోష్ ” సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ తీసుకోవడం చాలా సంతోషం.. జోష్ హోల్ టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

నేహా రెడ్డి  మాట్లాడుతూ… బెస్ట్ యాక్ట్రెస్ మా ఊరి సినిమాకు జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్ ఇస్తారని ఊహించలేదు.  నా టాలెంట్ ను  గుర్తించి నన్ను సెలెక్ట్ చేసిన ‘జోష్ “సౌత్ ఇండియన్ చైర్మన్ “జోష్ ” గారికి కృతఙ్ఞతలు తెలిపారు

అజయ్ గోష్ బెస్ట్  మాట్లాడుతూ..  విలన్ గా పుష్ప సినిమాకు గాను నంది అవార్డ్స్ ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఙతలు. రెండు తెలుగు  ప్రభుత్వాలు చేయలేని ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఒక సాధారణ పౌరుడు చేయడం నిజంగా అభినందనీయమన్నారు.

సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కనబర్చినవారికి  రెండు సార్లు జోష్ టాలెంట్  అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మూడోసారి చాలా ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ కార్యక్రమం విజయవంతం అవడం చాలా అనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు. అవార్డ్ గ్రహితలకు శుభాకాంక్షలు. ప్రతి ఏడాది ఈ అవార్డ్స్ ను తమ సంస్థ నుంచి ఇస్తాం అన్నారు. తమ అవార్ట్ ఫంక్షన్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.