టెనెంట్ చిత్రం ఏప్రిల్ విడుదల

Published On: March 20, 2024   |   Posted By:

టెనెంట్ చిత్రం ఏప్రిల్ విడుదల

సత్యం రాజేష్, వై.యుగంధర్, మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, మహాతేజ క్రియేషన్స్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’- ఏప్రిల్ మూడో వారంలో విడుదలకు సిద్ధమౌతున్న చిత్రం

‘పొలిమేర2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ప్రజెంట్ జనరేషన్ లో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. జెమిన్ జోమ్ అయ్యనేత్ డీవోపీ కాగా విజయ్ ముక్తవరపు ఎడిటర్.

నటీనటులు: సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ, ధనా బాల, చందు , అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: వై. యుగంధర్
నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
సహ నిర్మాత : రవీందర్ రెడ్డి .ఎన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ
సంగీతం : సాహిత్య సాగర్
DOP: జెమిన్ జోమ్ అయ్యనేత్
ఎడిటర్: విజయ్ ముక్తవరపు
కథ: యస్ శ్రీనివాస వర్మ
కో-డైరెక్టర్: అనిల్ కడివేటి
స్టంట్స్: రబిన్ సుబ్బు
ఆర్ట్: కరకరల చంద్ర మౌళి, సాయి
ప్రొడక్షన్ కంట్రోలర్:బి. రాంబాబు
డిజిటల్ మీడియా : వినీత్-సందీప్
PRO : తేజస్వి సజ్జా