టైగ‌ర్ 3 మూవీ ప్రెస్ మీట్

Published On: October 30, 2023   |   Posted By:

టైగ‌ర్ 3 మూవీ ప్రెస్ మీట్

టైగ‌ర్ 3లో ఇప్పటి వరకు మీరు చూసింది ఒక శాతం మాత్రమే సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుత‌మైన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను చూస్తారు: చిత్ర ద‌ర్శ‌కుడు మ‌నీష్ శ‌ర్మ‌

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, బ్యూటీ డాల్ క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టించిన చిత్రం భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ టైగ‌ర్ 3. ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 12న గ్రాండ్ లెవ‌ల్లో హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది. య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రాన్ని మ‌నీష్ శర్మ తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా మూవీలో యాక్ష‌న్ సీక్వెన్సులు వావ్ అనిపించేలా ఎలా ఉంటాయ‌నే విష‌యాన్ని టీజ‌ర్‌, ట్రైల‌ర్ ద్వారా మేక‌ర్స్ రివీల్ చేశారు. దీంతో టైగ‌ర్ 3పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి.

వైఆర్ఎఫ్ బ్యాన‌ర్ రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో టైగ‌ర్ 3 ఒక‌టి. అందులో చూపించిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూసిన ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌త‌కు లోన‌య్యారు. క‌చ్చితంగా ఈ పండుగ సీజ‌న్‌కు ఇదొక విందు బోజ‌నంలా ఉంటుందని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇందులో టైగ‌ర్ పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్‌, జోయ పాత్ర‌లో క‌త్రినా కైఫ్ న‌టించారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మ‌నీష్ శ‌ర్మ మాట్లాడుతూ టైగ‌ర్ 3 నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అస‌లు సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని ఇవి చ‌క్క‌గా ఎలివేట్ చేశాయి. అయితే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో మేం సినిమా గురించి చూపించింది ఒక శాతం కూడా లేదు. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్ని చూడ‌బోతున్నారు. ఈ మూవీలో 50-60 శాతం భారీ స్థాయిలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. ఇందులో నుంచి చిన్న స్నీక్ పీక్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నుకుంటున్నాం. ఎగ్జ‌యిట్‌మెంట్‌కు లోన‌వుతున్న ప్రేక్ష‌కుల‌కు స్నీక్ పీక్ ఓ స‌ర్‌ప్రైజ్‌గా ఉంటుంది. టైగ‌ర్ 3 వంటి సినిమాను సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రేక్ష‌కులు వెండితెర‌పై చూడాల‌నుకున్న‌ప్పుడు నెక్ట్స్ రేంజ్‌లో ఉండాల‌ని భావిస్తారు. క‌చ్చితంగా అలాంటి వారికి టైగ‌ర్ 3 ఓ దీపావ‌ళి ధ‌మాకాలా ఉంటుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ప్ర‌తి సీన్‌ను ఎంజాయ్ చేస్తారు అన్నారు.