టక్ జగదీష్ ఫస్ట్ లుక్ డిసెంబర్ 25న విడుదల
Published On: December 19, 2020 | Posted By: ivs
టక్ జగదీష్ ఫస్ట్ లుక్ డిసెంబర్ 25న విడుదల
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న నాని, శివ నిర్వాణ కాంబినేషన్ ఫిల్మ్ ‘టక్ జగదీష్’ ఫస్ట్ లుక్ విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ ఫిల్మ్‌లో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ‘టక్ జగదీష్’ ఫస్ట్ లుక్‌ను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హీరో నాని ప్రకటించారు. శుక్రవారం ఆయన ‘టక్ జగదీష్’కు సంబంధించిన ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. అందులో రోట్లో పప్పు దంచుతున్న ఓ స్త్రీ చేయి కనిపిస్తోంది. ఆ పోస్టర్‌పై “The focus shifts on 25th Dec” అని రాశారు. దానికి “This Christmas #TuckJagadishFirstLook” అనే క్యాప్షన్ జోడించారు.
నాని హీరోగా నటించిన హిట్ మూవీ ‘నిన్నుకోరి’తో పరిచయమై, రెండో సినిమా ‘మజిలీ’తోనూ సూపర్ హిట్ సాధించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండటంతో ‘టక్ జగదీష్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. టైటిల్‌తోటే ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకు విడుదల చేసిన ప్రి లుక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్‌తో సినిమాపై ఆసక్తి రెట్టింపవడం ఖాయమంటున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ స్వరాలు కూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, రావు రమేష్, నరేష్
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్