డిజె టిల్లు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

Published On: February 11, 2022   |   Posted By:

డిజె టిల్లు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత.
ఈ నెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది డిజె టిల్లు.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం వేడుకగా, ఆద్యంతం వినోదాత్మకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా
గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ…ఇప్పుడు ఎక్కడ చూసినా డిజె టిల్లు టైటిల్ సాంగ్ మోగుతోంది. ఫోన్ లో దర్శకుడు విమల్ కృష్ణ ఈ పాట గురించి వివరించారు. ఆయన స్పష్టంగా టిల్లు గురించి చెప్పడం వల్లే ఈ పాట ఇంత బాగా వచ్చింది. ముందు ఈ పాటను మా పెద్దబ్బాయి అనిరుధ్ విని పాట హిట్ అన్నాడు. రామ్ మిర్యాల సూపర్బ్ గా పాడాడు. అన్నారు.
దర్శకుడు రవికాంత్ పేరేపు మాట్లాడుతూ..ఈ చిత్రంలో నీ కనులను చూశానే అనే పాట రాశాను. ఈ పాట ఏడేళ్ల కిందట రాసిన పాట. ఈ సినిమాలో సందర్భం కుదిరి తీసుకున్నారు. సిద్ధు నేను విమల్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడే రామానాయుడు స్టూడియోలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాం. సిద్ధు ఇప్పుడే కాదు మొదటి నుంచీ ఇంతే యాక్టివ్ గా ఫన్ గా ఉండేవాడు. మా స్నేహంలో ఎన్నో గుర్తుండిపోయే జ్ఞాపకాలున్నాయి. డిజె టిల్లు కంప్లీట్ ఎంటర్ టైనర్. నిర్మాత వంశీ అన్నకు కంగ్రాట్స్. అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ మ్యూజిక్ కుదిరింది. టీమ్ అందరితో పాటు నాకు నేను కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటున్నాను. అన్నారు.
సెహరి చిత్ర హీరో హర్ష్ కానుమిల్లి మాట్లాడుతూ..డిజె టిల్లు ట్రైలర్ చాలా బాగుంది. సిద్ధు పర్మార్మెన్స్ కు కళ్లు తిప్పుకోలేకపోయాను. ఖిలాడీ, సెహరి, డిజె టిల్లు మూడు సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నాయిక సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ…డిజె టిల్లు ట్రైలర్ సూపర్ హిట్ అయ్యింది. సిద్ధును స్క్రీన్ మీద చూస్తేనే నవ్వొస్తుంది. వంశీ గారు పెద్ద సినిమాలు నిర్మించారు. ఈ సినిమా వారి బ్యానర్ లో మరో హిట్ అవుతుంది. ఫుల్ మీల్స్ లాంటి మూవీ. అన్నారు.
నటి ప్రగతి మాట్లాడుతూ…ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉందని చెప్పారు. నేను ఆలోచించే టైమ్ లో సిద్ధు ఫోన్ చేసి మీ క్యారెక్టర్ తో సినిమా లాండ్ అవుతుంది అన్నారు. ఆ మాటతో సినిమా చేస్తానన్నాను. ఇప్పుడు చెబుతున్నా ఈ సినిమా నాకొక మంచి ఆఫర్. అంత బాగుంటుంది. అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ…డిజె టిల్లు సిద్ధూ వేర్వేరు కాదు ఇద్దరూ ఒకటే. అందుకే ఆ క్యారెక్టర్ అంత సహజంగా ఉంది. ప్రేక్షకులు కూడా మూవీకి కనెక్ట్ అవుతున్నారు. అమాయకత్వం, చిలిపితనం, దేశాన్ని ఏలేద్దాం అనే క్వాలిటీస్ సిద్ధులో ఉంటాయి. అతనికి పట్టుదల ఎక్కువ. ఏదీ అంత త్వరగా వదిలేసుకోడు. ఆ తత్వమే అతన్ని ఇవాళ అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇన్ని రోజులు సిద్ధు పడిన కష్టానికి ఫలితం దక్కుతోంది. నీ టైమ్ వచ్చింది. డిజె టిల్లు నీకు సరిగ్గా సరిపోయే సినిమా. ఈ సినిమా మీద హిట్ అని రాసి ఉంది. టిల్లు టైటిల్ సాంగ్ అదిరిపోయింది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.
ప్రిన్స్ మాట్లాడుతూ…బయట మమ్మల్ని నవ్వించే సిద్ధు ఇప్పుడు డిజె టిల్లుగా మీకు ఫన్ ఇవ్వబోతున్నాడు. సిద్దు సక్సెస్ చూస్తే సంతోషంగా ఉంది. సినిమాను డబ్బింగ్ లో చూస్తూనే చాలా నవ్వుకున్నాం. ఇది హిట్ అవ్వాలి అని చెప్పడం కాదు తప్పకుండా అవుతుంది. మా అందరికీ ఆ నమ్మకం ఉంది. అన్నారు.
సింగర్ రామ్ మిర్యాల మాట్లాడుతూ…పాటకు సగం బలం సాహిత్యమే. మంచి పదాలు పడితే ఆ పాట మంచి హిట్ అవుతుంది. కాసర్ల శ్యామ్ అన్న అలాంటి పాటే ఇచ్చారు. సిద్దుకు మ్యూజిక్ టేస్ట్ ఉంది. డిజె టిల్లు సాంగ్స్ హిట్ అ‌వడానికి దర్శకుడు విమల్ కు ఉన్న స్పష్టత కారణం. అన్నారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ..డిజె టిల్లు ఎలా ఉంటాడో నిజాయితీగా స్క్రీన్ మీదకు తీసుకురావాలని అనుకున్నాం. సిద్ధు ను డైరెక్ట్ చేసినందుకు గర్వంగా ఉంది. సూపర్బ్ పర్మార్మర్ అతను. ట్రైలర్ తో సగం సక్సెస్ అందుకున్నాం. మిగతాది థియేటర్ లో వస్తుందని ఆశిస్తున్నాం. కొత్త దర్శకుడిని అయినా నన్ను నమ్మి నిర్మాత వంశీ గారు సినిమా ఇచ్చారు. పూర్తిగా సహకారం అందించారు. నా డైరెక్షన్ టీమ్ సపోర్ట్ మర్చిపోలేను. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక లిఫ్ట్ ఇచ్చారు. ప్రిన్స్ నా స్నేహితుడు అతని గురించి ఏం చెప్పను. నాకు నచ్చిన రంగంలోకి పంపి ప్రోత్సహించిన మా పేరెంట్స్ కి థాంక్స్. అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…సిద్ధు చాలా రోజుల నుంచి ఒక మంచి సినిమా కోసం స్ట్రగుల్ పడుతున్నాడు. డిజె టిల్లు తో సరైన సినిమా వచ్చేసింది. మా ఫ్రెండ్స్ నుంచే ఈ సినిమాకు చాలా టికెట్లు అడుగుతున్నారు. కృష్ణ అండ్ హిస్ లీల సినిమా చూశాక సిద్ధుతో సినిమా ప్రొడ్యూస్ చేద్దామని పిలిచాను. అతనేమో నేనే సినిమా చేసుకుంటా అనే మూడ్ లో ఉండేవాడు. సినిమాను ప్యాషన్ తో నిర్మించే నిర్మాతల్లో వంశీ గారు ఒకరు. ఆయనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా. అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..డిజె సినిమా గురించి మాట్లాడాల్సింది అంతా ట్రైలర్ రిలీజ్ లో మాట్లాడాను. కంప్లీట్ ఫన్ ఫిల్మ్ ఇది. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…కొన్ని పర్సనల్ కారణాల వల్ల హీరోయిన్ నేహా శెట్టి ఇక్కడికి రాలేదు. కానీ ఆమె ఈ లైవ్ చూస్తుందని అనుకుంటున్నాను. డిజె టిల్లు సినిమాతో నేను ఇప్పటిదాకా వినని పదాలు వింటున్నాను. టికెట్ బుకింగ్స్, బ్రేక్ ఈవెన్, థియేట్రికల్ రైట్స్ అమ్మకం, ఓవర్సీస్ లో బుకింగ్స్..ఇవన్నీ నాకు కొత్తగా ఉన్నాయి. గుంటూర్ టాకీస్ తో పని అవుతుందని అనుకున్నాను కానీ మిస్ అయ్యింది. చిన్న గ్యాప్ వచ్చింది. డిజె టిల్లు చుట్టూ ఒక బజ్ క్రియేట్ అయ్యింది. 12న మీరు థియేటర్ కు వస్తారు. సినిమా చూస్తారు ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని మేము నవ్విస్తాం. సితార సంస్థలో పనిచేయడం గర్వంగా ఉంది. నిర్మాత వంశీ గారు సినిమాకు కావాల్సింది చేసుకో అన్నారు. త్రివిక్రమ్ గారు మాకు మార్గదర్శిలా ఉన్నారు. థమన్ తో పనిచేయడం ఒక మంచి అనుభవం. శ్రీచరణ్ చక్కటి కాంట్రిబ్యూషన్ చేశారు. అన్నారు.