డెవిల్ మూవీ నాలుగు రోజుల్లో రూ. 22.59 కోట్లు వసూళ్లను సాధించిన పీరియాడిక్ మూవీ

Published On: January 3, 2024   |   Posted By:

డెవిల్ మూవీ నాలుగు రోజుల్లో రూ. 22.59 కోట్లు వసూళ్లను సాధించిన పీరియాడిక్ మూవీ

బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ భారీ చిత్రం డెవిల్ … నాలుగు రోజుల్లో రూ. 22.59 కోట్లు వసూళ్లను సాధించిన పీరియాడిక్ మూవీ

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం అద్భుతంగా కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకెళ్తోంది.

పీరియాడిక్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. అటు అభిమానులు, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా సినిమా అందుకుంది. సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో చక్కటి నటనతో అందరి ప్రశంసలను అందుకుంటున్నారు.

డెవిల్ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. తొలి రోజున ఈ చిత్రం రూ. 4.92 కోట్లను రాబట్టుకుంది. కొత్త ఏడాది ప్రారంభం కావటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది. తొలి రోజు కంటే ప్రతీ రోజూ ఎక్కువగా వసూళ్లు వస్తుండటం విశేషం.

అన్నివర్గాల ప్రేక్షకులను డెవిల్ మూవీ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ యాక్షన్ మూవీకి రిపీటెడ్‌గా ప్రేక్షకులు వస్తున్నారు. దీంతో డెవిల్ సినిమా విడుదలైన నాలుగు రోజులకే రూ.22.59 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. సంక్రాంతి రానుండంతో పాటు చక్కటి వారాంతం కలిసి రావటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇదే స్పీడుని ఇంకా కొనసాగిస్తుందని.. వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే బాక్సాఫీస్‌కి డెవిల్‌తో సరికొత్త ఎనర్జీ వచ్చినట్టుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.

ఆసక్తికరమైన కథ, కథనాలతో డెవిల్ సినిమా థ్రిల్లర్ ప్రియులను, కమర్షియల్ సినీ ప్రేమికులకు అలరిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి అనిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.