తండేల్ మూవీ కీలక షెడ్యూల్ పూర్తి

Published On: February 6, 2024   |   Posted By:

తండేల్ మూవీ కీలక షెడ్యూల్ పూర్తి

అల్లు అరవింద్ ప్రెజెంట్స్  నాగ చైతన్య అక్కినేని, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ తండేల్ కీలక షెడ్యూల్ పూర్తి  వర్కింగ్ స్టిల్స్ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో భారీ బడ్జెట్ తో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ కీలక లెంతీ షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, ఇతర తారాగణంపై సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకకరీంచారు. ఈ మేరకు వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది అర్ధమౌతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి చాలా సహజ సిద్ధంగా కనిపించారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం సుందరమైన, సహజసిద్ధమైన లోకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే విడుదలైన తండేల్ ప్రమోషనల్ కంటెంట్ సంచలనం సృష్టించింది. ఎసెన్స్ అఫ్ తండేల్ గ్లింప్స్ నేషనల్ వైడ్ గా ట్రెండై సినిమాపై అంచనాలని మ్యాసీవ్ గా పెంచింది. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ ఉండబోతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ మెస్మరైజింగ్ చేయనుంది. యదార్థ సంఘటనల కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య ఇందులో తన పాత్ర కోసం కంప్లీట్ గా మేక్ఓవర్ అయ్యారు.

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.

తారాగణం :

నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్