తిరగబడరసామీ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల 

Published On: June 19, 2023   |   Posted By:

తిరగబడరసామీ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల 

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేసిన రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, మల్కాపురం శివకుమార్ , సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ తిరగబడరసామీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

హీరోయిన్, రాజ్ తరుణ్ ని ఎత్తుకున్నట్లు వున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. పోస్టర్ లో రాజ్ తరుణ్ బనియన్, బాక్సర్స్ ధరించి కళ్ళజోడుతో కనిపించారు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ప్లజంట్ మ్యూజిక్ తో మోషన్ పోస్టర్ రివిల్ కావడం ఇంట్రస్టింగా వుంది.

ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే పాటు రఘు బాబు, జాన్ విజయ్, పృధ్వి ఇతరముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్ అందిస్తున్నారు.

తారాగణం :

రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్రి సత్తి

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
సంగీతం: జెబి
డీవోపీ: జవహర్ రెడ్డి M.N
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి