తిరగబడరసామీ మూవీ సెలబ్రేషన్ సాంగ్ విడుదల

Published On: February 2, 2024   |   Posted By:

తిరగబడరసామీ మూవీ సెలబ్రేషన్ సాంగ్ విడుదల

రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ తిరగబడరసామీ నుంచి సెలబ్రేషన్ సాంగ్ విడుదల

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ తిరగబడరసామీ. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి సెలబ్రేషన్ సాంగ్ ని విడుదల చేశారు. కంపోజర్ జేబీ ఈ పాటని పర్ఫెక్ట్ సెలబ్రేషన్ నెంబర్ గా కంపోజ్ చేశారు. లిప్సికా భాష్యం, అదితి బావరాజు, చైతు సత్సంగి వీనుల విందుగా అలపించారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో విజువల్స్ కన్నుల పండగలా వున్నాయి.

యువతని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ బిగ్ బాస్ తో యావత్ భారతాన్ని అలరించిన మనరా చోప్రా ఈ చిత్రంలో ఓ విభన్న పాత్రతో పాటు ప్రత్యేక గీతంతో అలరించబోతుంది.

ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.

ఫిబ్రవరి 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం :

రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
సంగీతం: జెబి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి