తిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ

Published On: March 29, 2024   |   Posted By:

తిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

 

 

స్టోరీ లైన్ :

టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్ లు,  డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఆలా ఈవెంట్స్ చేసుకొంటున్నా టిల్లు లైఫ్ లోకి  ఓ రోజు  లిల్లీ జోసెఫ్(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. టిల్లు లిల్లితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మళ్లీ టిల్లు  బర్త్ డే రోజు లిల్లీ తనని ఒక హెల్ప్ కోరుతుంది.టిల్లు లిల్లీకి మళ్ళీ హెల్ప్ చేశాడా ? అసలు వీళ్ళకి  పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? మళ్లీ రాధికా(నేహా శెట్టి) టిల్లు దగ్గరకి ఎందుకు వచ్చింది? చివరికి టిల్లు ఏమయ్యాడో  అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

డీజే లు చేసుకొనే టిల్లు లిల్లీ తో లవ్ లో పడి.. మళ్ళీ ఇరకాటంలో పడటం.

ఆర్టిస్ట్ ఫెరఫార్మెన్స్ :

డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చినా టిల్లు 2 ఎంటర్టైన్మెంట్ గా ఒప్పించింది. సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్లీ టిల్లు వైబ్స్ ని గుర్తు చేస్తూ సినిమా ప్లే అవుతుంటుంది.

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ తన యాక్టింగ్ తో మెరిపించాడు. తన మార్క్ టైమింగ్ కామెడీతో ప్రతి సీన్ లో సినిమా అంతా నవ్వించాడు. హ్యాండ్సమ్ గా కనిపించాడు .

అనుపమ తన గ్లామ్ షో తో , పెర్ఫామెన్స్ తో  సినిమాలో అదరగొట్టింది.  సిద్దు కి, అనుపమ మధ్య కెమిస్ట్రీ చూడటానికి బాగుంది.

మురళి శర్మ, మధుసూదన్ గౌడ్,మిగిలిన నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది.

టెక్నికల్ గా :

టెక్నికల్ గా  దర్శకుడు మల్లిక్ రామ్ డీజే టిల్లు కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని నిలబెట్టాడు. రామ్ మిర్యాల మ్యూజిక్ బాగుంది.  సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది.ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు.

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ ,

అనుపమ పరమేశ్వరన్,

మల్లిక్ రామ్ డైరెక్షన్ .

మైనస్ పాయింట్స్ :

స్టోరీ పరంగా కొన్ని అంశాలు రొటీన్ గా  ఉన్నాయి

తీర్పు :

టిల్లు గాడు థియేటర్ లో మళ్ళీ  హిట్ కొట్టాడు.

నటీనటులు:

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, మురళీధర్ గౌడ్ తదితరులు

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : టిల్లు స్క్వేర్

బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

విడుదల తేదీ: 29-03-2024

సెన్సార్ రేటింగ్: “ U/A “

దర్శకత్వం: మల్లిక్ రామ్

సంగీతం: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు

ఎడిటింగ్:నవీన్ నూలి

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య

రన్‌టైమ్: 123 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్