దేవర మూవీ అక్టోబర్ 10 2024 విడుదల

Published On: February 17, 2024   |   Posted By:

దేవర మూవీ అక్టోబర్ 10 2024 విడుదల

దసరా సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర అక్టోబర్ 10న విడుదల

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ భారీ చిత్రం దేవర. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైప్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం దేవర పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది.

దసరా సందర్భంగా దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి నెట్టింట్లో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ పోస్టర్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ హై లెవెల్లో ఉండబోతోన్నాయని, ఎన్టీఆర్‌ను మరింత మాస్ కారెక్టర్‌లో చూపించబోతోన్నారని అర్థమైంది.

ఇది వరకే రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అయిందో.. సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న దేవర చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.