నరుడి బ్రతుకు నటన చిత్రం అశోక్ పోస్టర్ విడుదల

Published On: July 20, 2020   |   Posted By:

నరుడి బ్రతుకు నటన చిత్రం అశోక్ పోస్టర్ విడుదల

నరుడి బ్రతుకు నటన సినిమా లో కీలక పోలీస్ పాత్ర లో అశోక్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో  తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న కొత్త సినిమా “నరుడి బ్రతుకు నటన”. తనికెళ్ళ భరణి, తల్లాడ సాయికృష్ణ, మాధురి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా కి జానీ దర్శకుడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర లో చేసిన అశోక్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. జూలై 21న అశోక్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ ని విడుదల చేసినట్లు దర్శకుడు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదటి సారి తెరపై అశోక్ నటించాడు. నెగిటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో  అశోక్ తన నటనని నిరూపించుకున్నాడు.

అశోక్ పుట్టినరోజు సందర్భంగా మేము ఈ పోస్టర్ ని విడుదల చేసాం అన్నారు.

తల్లాడ అశోక్ మాట్లాడుతూ చిన్న నాటి నుండి పోలీస్ అవ్వాలి,కనీసం పోలీస్ డ్రెస్ లో ఎలా ఉంటానో అనుకునే వాడిని,తర్వాత బిజినెస్ లో ఉండి ఇంకా యాక్టింగ్ ని పక్కన పెట్టాను.మళ్ళీ ఈ నరుడి బ్రతుకు నటన సినిమా లో కథ నచ్చింది, అందులో నేను ఎప్పటి నుండో అనుకుంటున్న పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఉండే సరికి హ్యాపీ గా క్యారెక్టర్ ని చేసాను. ఫస్ట్ టైమ్ కెమెరా ముందు యాక్టింగ్ అయ్యేసరికి లొకేషన్ లో సీన్స్ చేయడానికి ఒకటి రెండు టెక్స్ పట్టింది.ఇలా నా బర్త్ డే సందర్భంగా మా టీం నా పోస్టర్ ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సినిమా కి కథ-శివ కాకు,
ఎడిటింగ్-శ్రీకాంత్ కురెళ్లి,
కెమేరా-శ్యామ్&ఆర్ ఎస్,