నా సామిరంగ మూవీ థాంక్ యూ మీట్

Published On: January 16, 2024   |   Posted By:

నా సామిరంగ మూవీ థాంక్ యూ మీట్

నా సామిరంగ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: థాంక్ యూ మీట్ లో కింగ్ నాగార్జున అక్కినేని

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ నా సామిరంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని సంక్రాంతి కింగ్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.

థాంక్ యూ మీట్ లో కింగ్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. చాలా ఆనందంగా వున్న నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు, అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, వారి అనందం చూస్తుంటే నాకు చాలా అనందంగా, తృప్తిగా వుంది. మా యూనిట్ లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ ప్రేమతో, సంక్రాంతికి విడుదలవ్వాలి, పెద్ద విజయం సాధించాలనే సంకల్పంతో పని చేశారు. ఇప్పుడు ఫలితం కూడా అంత గొప్పగా వచ్చింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్టార్ కీరవాణి గారని మొదటి నుంచి చెబుతున్నాను. ఇప్పుడు అదే మాట చెబుతున్నా. అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ చాలా హార్డ్ వర్క్ చేశారు. రోజుకి కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. మిగతా సమయం అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉండేవారు. ఇది హ్యుజ్ మూవీ. చాలా పాత్రలు వున్నాయి. ఇంతమందిని, ఇన్ని పాత్రలని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. తనకి చాలా గొప్ప భవిష్యత్ వుంటుంది. డివోపీ శివేంద్ర హనుమాన్ చేశాడు. అందులో తన వర్క్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మా సినిమాలో కూడా చాలా చక్కటి వర్క్ చేశాడు. ఇక సంక్రాంతి అంటే శివేంద్రనే కెమరామ్యాన్ తీసుకుంటారేమో. ఇప్పుడు తను సంక్రాంతి అల్లుడు(నవ్వుతూ). నిర్మాత చిట్టూరి గారు ఈ కథ వినగానే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే అయ్యింది. ఆయన గొప్ప ప్రోత్సాహం అందించారు. అలాగే పవన్ గారు కూడా. అలాగే టెక్నిషియన్స్ అంతా చాలా కలసికట్టుగా పని చేశారు. నరేష్ తో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. తన చేసిన సీన్స్, డ్యాన్సులు, యాక్షన్ అద్భుతంగా వున్నాయి. సెకండ్ హాఫ్ లో తను ఎమోషన్ పండించకపోతే క్లైమాక్స్ పండేది కాదు. రాజ్ తరుణ్ కూడా చక్కని నటన కనబరిచాడు. మిర్నా, రుక్సర్, షబ్బీర్, రావు రమేష్ గారు, నాజర్ గారు అందరూ చక్కని పాత్రలలో ఒదిగిపోయారు. ఆషికా కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. అలాంటి పాత్ర చేయడం అంత సులువు కాదు. తన పాత్రలోని రెండు లేయర్స్ ని చాలా అద్భుతంగా చేసింది. తనకి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నాను. మీడియా మిత్రులు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు.

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ నాగార్జున గారికి ఇది సంక్రాంతి హ్యాట్రిక్. డీవోపీ శివేంద్ర ఈ సంక్రాంతి రెండు విజయాలు అందుకున్నాడు. తొలి సినిమాతోనే దర్శకుడు విజయ్ బిన్నీ పెద్ద హిట్ ఇచ్చారు. మూడు నెలలు పాటు టీం అంతా చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కీరవాణి గారు చంద్ర బోస్ గారు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. నాగార్జున గారు అభిమానులు ఫోన్ చేసి ఇదీ మాకు కావాల్సిన సినిమా మా వింటేజ్ నాగార్జున గారు ఇలా వుండాలి. ఇలాంటి సినిమాలే చేయాలి అని చెబుతున్నారు. ఇదంతా టీం వర్క్. సంక్రాంతి పండగలా వుండే సినిమా ఇది. అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని థియేటర్స్ లో ఆస్వాదించాలి. నా ఫేవరేట్ యాక్టర్ నాగార్జున గారితో నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రని ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి గారు, పవన్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు విజయ్ బిన్నీ మాట్లాడుతూ నా సామిరంగని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్స్. ఈ సినిమాలో వింటేజ్ నాగార్జున గారిని చూపిస్తానని మాటిచ్చాను. ఇప్పుడు ప్రేక్షకులు అభిమానుల రెస్పాన్స్ చూస్తుంటే చాలా అనందంగా వుంది. మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని తీశాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకుల నుంచి వస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. నన్ను దర్శకుడిగా ఎంచుకున్న నాగార్జున గారికి ధన్యవాదాలు. నరేష్ గారికి థాంక్స్. ఆయన సీన్స్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. అషికా ఈ సినిమాతో అందరి ఫోన్ లో వాల్ పేపర్ అయిపోతారు. ఈ సినిమా ఇంత స్పీడ్ గా చేయడానికి, ఇంత గొప్ప క్యాలిటీతో రావడానికి కారణం మా నిర్మాత శ్రీనివాస గారు. పవన్ గారికి ధన్యవాదాలు. ఈ టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని షార్ట్ స్పాన్ లో పూర్తి చేశామని అంటున్నారు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది చేయాలంటే ,మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వుండాలి. మా టీం అంతా చాలా కష్టపడ్డారు. కీరవాణి గారు ఇచ్చిన అద్భుతమైన పాటలు నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. చంద్రబోస్ గారు వండర్ ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ థియేటర్స్ కి రండి. పండగ పూట నా సామిరంగని ఎంజాయ్ చేయండి అన్నారు.

హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ సినిమాని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. వరాలు పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చాలా అనందంగా వుంది. నాగార్జున గారికి ధన్యవాదాలు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. నాగార్జున గారు లాంటి పెద్దస్టార్ మూవీలో ఇంత చక్కని పాత్ర దొరకడం నా అదృష్టం. దర్శకుడు విజయ్ బిన్నీకి ధన్యవాదాలు. అద్భుతంగా ప్రజెంట్ చేశారు. నిర్మాత శ్రీనివాస్ గారు, పవన్ గారికి చాలా థాంక్స్. నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు అందరితో కలసి పని చేయడం మంచి అనుభూతి. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అన్ని కమర్షియల్ అంశాలు వున్న చిత్రమిది. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలి అని కోరారు.

డిఓపీ దాశరధి శివేంద్ర మాట్లాడుతూ కాలేజీ రోజుల్లో శివ సినిమా చూసి సైకిల్ చైన్ జేబులో వేసుకొని తిరిగే వాడిని. ఇప్పుడు నాగార్జున గారితో పని చేసి అదే సీక్వెన్స్ నేను తీసినందుకు చాలా ఆనందంగా వుంది అన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.