నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి ఇంటర్వ్యూ 

Published On: March 13, 2024   |   Posted By:

నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి ఇంటర్వ్యూ 

నా దేశం కోసం. నా దేశ ప్రజల కోసం ‘రజాకార్’ సినిమా చేశాను – నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి ఇంటర్వ్యూ…

ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పండి సార్‌…

ఏడో నిజామ్‌.. సెపరేట్‌ కంట్రీ ఫార్మ్ చేద్దాం అనుకున్నారు.  తుర్కిస్తాన్‌ ఆబ్లిక్‌ ఉస్మానిస్తాన్‌ అని పేరు కూడా  అనుకున్నారు.  ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసి గోవాను పోర్చుగీస్‌ నుంచి కొనుక్కుందాం. కొనుక్కుని స్వదేశం ఏర్పాటు చేసుకుందామనే ఆలోచన కూడా వాళ్లకు వచ్చింది. ఏడవ నిజాం ధనిక రాజు మన దేశంలో. ఆలోచన వచ్చిందే తడవుగా బ్రిటిష్‌ వారి దగ్గరకు వెళ్లారు. అప్పటికి యునైటెడ్‌ నేషన్స్ కన్సల్టేషన్‌ చేస్తే, అప్పుడు వాళ్లు ఓ మాటన్నారు. సెపరేట్‌ దేశం కావాలంటే సెపరేట్‌ కమ్యూనిటీ ఉండాలి అని! ఆ మాట విన్న వీళ్లకు వీళ్లకు దుర్బుద్ధి పుట్టింది. అందరినీ మతమార్పిడి చేద్దామని అనుకున్నారు. 60 వేల అత్యాచారాలు , రెండు లక్షల హత్యలు చేశారు. దాన్ని చరిత్రను చిత్రంగా చూపించడానికి సమస్యేంటి? నేను ఇక్కడ పుట్టిన బిడ్డను.నా ప్రాంతంలో జరిగిన అమానుషాన్ని చూపించాలనుకున్నా. అరుదైన ఆ ఘట్టాన్ని తెరకెక్కించాలనుకున్నా. హిందువుల మీద ఊచకోత జరిపిన ఆ నిజామ్‌ రాజు బయట ప్రపంచంలో మంచి వ్యక్తిగా చలామణి అయ్యాడు. ఓ యూనివర్శిటీ కట్టాడు. ఆసుపత్రి కట్టాడు. ఏ రాజూ ఇంత పెద్దగా కట్టలేదన్న మాట ఉంది కదా. కట్టిన మాట వాస్తవమే. కానీ, వాళ్ల తాత జాగీరులో కట్టలేదు. జనాలు కట్టిన సర్కారు రకంతో కట్టాడు. ఆ రోజుల్లో భూమి శిస్తు, పుడితే శిస్తు, చస్తే శిస్తు, ఆడపిల్లయితే శిస్తు, మగపిల్లాడైతే శిస్తు అని చాలానే ఉండేవి. వాటితో వచ్చిన డబ్బులతో కట్టాడు. మరి అంత మంచివాడైతే హిందువులను ఊచకోత కోయాలనే దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? దాన్ని చెప్పాలి కదా… ఇవాళ హిస్టరీ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. చరిత్ర అనేది పుస్తకాల్లో ఉండొచ్చు. పబ్లిక్‌ డొమైన్లలో ఉండొచ్చు. సినిమాల రూపంలో ఉండొచ్చు. నేను సినిమా చేశాను.

సినిమాను నిర్మించడానికి కారణమేంటి?

ఇవాళ భారతదేశంలో 142 కోట్ల మంది ఉన్నారు. వారిలో 100 కోట్ల మంది యంగ్ జనరేషన్‌ . వీళ్లకు ఆనాడు జరిగిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ధనికుల మీద జరగకపోయి ఉండవచ్చు. కానీ పేదవాళ్ల మీద జరిగాయి కదా… ప్రతి ఒక్కరి అమ్మమ్మ మీద, నాయనమ్మ మీద, తాత మీద… ఇలా ఎవరో ఒకరి మీదయితే జరిగాయి కదా. వాళ్లని తొక్కారు. చెరిచారు. చంపారు. ఆ విషయాలను ఈ నాటి సమాజానికి చెప్పాలనే బాధ్యతను నేను తీసుకున్నాను.

మీరు భాజపాలో ఉన్నారని, కావాలని తీస్తున్నారా?

భాజపాకు ఈ సినిమాను తీయడానికి ఇది అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తున్నది తెలంగాణలో. భాజపా సెంట్రల్‌ లెవల్లో సత్తా చాటుతోంది. నరేంద్రమోడీతో ధీటైన నాయకుడు, మగాడు లేనే లేడాయె. భూమ్మీద ఇక లేడిప్పుడు. ఒకవేళ ఉంటే భాజపాలోనే ఉండవచ్చు. ఆయన తర్వాత ఇంకో వ్యక్తి. కానీ భాజపాకి ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ భాజపా. 13 కోట్ల మంది భాజపా రిజిస్టర్డ్ కార్యకర్తలున్నారు. వీళ్లు ఒక్కొక్కరు నాలుగు ఓట్లు, మూడు ఓట్లు తెచ్చినా ఎన్ని కోట్ల ఓట్లు వస్తాయో మీకు తెలుసు. అందువల్ల, ఈ చిన్న సినిమా, డాక్యుమెంటరీ తీసి క్యాష్‌ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి లేదు. నేను ఎక్కడున్నా ఈ సినిమా చేసేవాడిని.

మరి సినిమాకు వస్తున్న వ్యతిరేకత గురించిన మాటేంటి?

నేచురల్‌గా జరిగేదే కదా… ఎవరు వ్యతిరేకిస్తున్నారు? రజాకార్ల వారసులు వ్యతిరేకిస్తారు. జెన్యూన్‌ ముస్లింలు అపోజ్‌ చేయరు. ఎందుకంటే వారికి, రజాకార్లకు సంబంధం లేదు. ముస్లిం సమాజం కూడా చాలా పెద్దది కదా. మన దగ్గర గంగా యమునా తైజీబ్‌ ఉందిగా. మనం అందరం కలిసి బతుకుతున్నం. కలిసి ముందుకు సాగుతున్నాం. భారతదేశంలో పుట్టినవారందరూ భరతమాత బిడ్డలే కదా. మనం ఎప్పుడైనా దేశాన్ని ఫెమినిస్టిక్‌గా పిలుచుకుంటాం. ఈ మదర్‌ల్యాండ్‌లో పుట్టినవాడికి ఇక్కడి అకృత్యాలను చూపిస్తే ఎవరికి నొప్పి? నొప్పి ఉన్నవాడు మందు పెట్టుకోండి. ఇక్కడ వేరే విధంగా ఇంకెవరో అంటే పడటానికి నేను లేదు. నేనేదో 3,4,5 కోట్లతో సినిమా తీయలేదు. కంప్లీట్‌ హై క్వాలిటీతో 50 కోట్లకు పైగా పెట్టి తీశా. నా దేశం కోసం. నా దేశ ప్రజల కోసం చేశా. నా శేషజీవితంలో ఏదో ఒక మంచి పని చేయాలి. చరిత్రలో నిలిచిపోవాలి. చరిత్రను సినిమాగా చేసి ఈ సమాజానికి తెలియజేయాలి. హైదరాబాద్‌ బ్యూటీఫుల్‌గా ఉంది. దీన్ని కబంద హస్తాల నుంచి విముక్తి చేసింది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. హి ఈజ్‌ద  ఫాదర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌. ఖరాబైన వారి పిల్లలున్నారా? వాళ్ల కాళ్లు ముట్టుకుంటామా?

ఈ సినిమాను ఈ  పీరియడ్‌లో తీయాలనే ఆలోచన ఎప్పటిది మీకు?

జనవరి 27, 2022న రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగాను నేను. విమానం కింద టచ్‌ కాగానే రజాకార్‌ అని వచ్చింది. స్వామిని నేను ఇష్టంగా కొలుస్తాను. దేవుడే అనిపించాడా  అని అనిపించింది. కారులో కూర్చుని డైరక్టర్‌ యాటా సత్యనారాయణకి ఫోన్‌ చేశా. ఇలా నాకు ఆలోచన వచ్చిందని చెప్పా. సినిమా తీద్దామా దీని మీద అని అనుకున్నాం. ఎందుకంటే పుస్తకం రాసే ఓపిక, చదివే ఓపిక నాకు లేదు. అయితే, ప్రజల కోసం చేయాలని చేశా. కులాల మీద, రంగుల మీద డివైడ్‌ అయిన మనం ఐక్యత కావాలి. మళ్లీ రజాకార్లు పుట్టొద్దు అనే కారణాలతో తీశా. నాకు ఏ మతం మీదా వ్యతిరేకత లేదు. ఒకడే వ్యక్తి… దేవుణ్ణి కించపరిచేలాగా మాట్లాడాడు… పోలీసులు పక్కక జరిగితే సంగతి చూపిస్తా అన్నాడు… నేనిక్కడే ఉన్నాను. ఎవరైనా రావాలి.. కబడ్దార్‌.. ఎవరినీ భయపడేది లేదు. నా దేశంలో నేను ఎవరికి భయపడాలి? రెవల్యూషనరీ కండి అని అనడం లేదు. కళ్లు తెరవండి. సమాయత్తం అవండి. గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా చూడండి అని చెబుతున్నా. సామాన్యుల గ్రామీణులు వాళ్లని ఎప్పుడో ఎదిరించాడు. ఇవాళ ఏం జరుగుతుంది ప్రపంచంలో?

పొలిటికల్‌ కెరీర్‌కి ప్లస్‌ అయ్యేలా సినిమా ఉంటుందా?

నా పొలిటికల్‌ కెరీర్‌ అయిపోయింది. ఐ యామ్‌ డన్‌. నేను రిటైర్‌ అవుదామనుకుంటున్నా. యాక్టివ్‌ పాలిటిక్స్ లో ఉండదలచుకోవడం లేదు. నాకు 62 ఏళ్లిప్పుడు. నా జీవితం ఇంకో 20 ఏళ్లు బతుకుతా. 10 ఏళ్లు మేలుకుంటా. పదేళ్లు పడుకుంటా. జల్దీ జల్దీ ఎంజాయ్‌ చేయాలి. ఫ్యామిలీతో పిల్లలతో ఉండాలి. నా రాజకీయం కోసం తీయలేదు ఈ సినిమాను. ఈ సినిమా తీసి చాలా కష్టాలు పడుతున్నా. ఇప్పటికే నన్ను తొక్కేస్తున్నారు. నేను సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీస్తా.

నిర్మాతగా కంటిన్యూ అవుతారా?

నేషనల్‌ మీడియా పిలిచి 40 టీవీలు నన్ను ఇంటర్వ్యూలు చేస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు కదా… ఆ రేంజ్‌ ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి సినిమాలో. నేను సీరియస్‌ ప్రొడ్యూసర్‌ కాకపోవచ్చు కానీ, సీరియస్‌ సిటిజన్‌ని. నా దేశంలో నేను పుట్‌పుట్‌గాళ్లకు బయపడాల్సిన అవసరం లేదు. నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఏడవ నిజామ్‌కి వ్యతిరేకం నేను. వాళ్లకు పుట్టినోళ్లయితే రండి.. లేకుంటే పక్కకు జరగండి. నేను తెలంగాణ ప్రాణ, మానాలను పోగొట్టుకున్నవాళ్లని పోట్రే చేసినా.

సెప్టెంబర్‌ 17 అనేది… ఇంతవరకు ఏ ప్రభుత్వం అనౌన్స్  చేయలేదు… దీన్ని అఫిషియల్‌గా చేస్తారా?

మొన్నటిదాకా మూడక్షరాల కచడా  పాలించింది. హమామ్‌ ఖాన్‌లో పడ్డారు వాళ్లు. అక్కడ పడ్డోడికి సీన్‌ కట్‌ అవుతుంది. గోల్కొండ మీద జెండా ఎగరేయడమేంటి? విమోచన దినం ఎవరూ జరపలేదు. భాజపా పార్టీ మూడేళ్లుగా అమిత్‌షా వస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ఆయనే మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కి జాతిపిత సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌. నెహ్రూ ఎందుకు అన్ని రోజులు వెయిట్‌ చేశారో తెలియజెప్పాలి కదా… అది మా సినిమా ద్వారా చెప్పారు. లక్కీగా కాంగ్రెస్‌ వాళ్లు దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. మేం మంచి ఉద్దేశంతో సినిమా చేశాం.

యాటా సత్యనారాయణ ఎంతవరకు న్యాయం చేశారు?

ప్రతి పాత్రకూ ఆయన న్యాయం చేశారు. 16 కోట్లన్నారు.. ఇప్పుడు 50 దాటింది. దానివల్ల ఇబ్బంది అయింది కానీ, టాప్‌ క్వాలిటీ ఉంది. పెద్ద కేరక్టర్లు, డైరక్టర్‌, ప్రొడ్యూసర్‌ లేరు కానీ, బాహుబలికి ఏమీ తక్కువ కాదు ఈ సినిమా. ఒక్కొక్కరోజు 900  మంది జూనియర్‌ ఆర్టిస్టులను వాడాం. భీమ్స్ మ్యూజిక్‌, శంకర్‌ మహదేవన్‌, ఖైలాష్‌ ఖేర్‌, మోహన భోగరాజు పాడిన పాటలు గుండెకు గుచ్చుకుంటాయి. ఆ పాటలు సినిమాలో చూస్తే ఎక్కి ఎక్కి ఏడుస్తారు. మా అమ్మకు 83 ఏళ్లున్నాయి. ఆమెకు ఏడేళ్లట అప్పుడు. అప్పుడు వాళ్ల అక్క దగ్గరకి ముంబైకి పంచారు. మా తాత గూడూరు నారాయణరెడ్డి… గూడూరు గ్రామంలో ఆయన చేసిన విషయాలు ఇంకా చెప్పుకుంటారు.

హిందీలో రెస్పాన్స్ ఎలా ఉంది?

ఫెంటాస్టిక్‌ రెస్పాన్స్ ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం. రాములవారి ఆలయ ప్రాణప్రతిష్ట తర్వాత, హనుమాన్‌ సినిమా వచ్చింది. సనాతన ధర్మం మీద చాలా మంది ఆలోచిస్తున్నారు. కళ్లు తెరుచుకుంటున్నారు. నా సినిమాలోనూ ధర్మం మీద జరిగిన దాడినే చూపించాను. తెలుగు ఏరియాల్లో బ్రహ్మాండంగా ఆడుతుందనే నమ్మకం ఉంది. రజాకార్‌ మన హిస్టరీ కాబట్టి ఇక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. వయసులో పెద్దవారు, యువకులు, మహిళలు పోటీపడి చూస్తారు. పెద్దవారికి, వాళ్ల చిన్నతనంలో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి.

కాశ్మీర్‌ ఫైల్స్, కేరళ స్టోరీస్‌ వంటి వాటి తరహాలోనే ఉంటుందా? వేరుగా అనిపిస్తుందా?

నేను ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. నేను మళ్లీ చెబుతున్నా. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏడో నైజామ్‌కి నేను వ్యతిరేకం. అలాంటి ఘటన ఎప్పుడూ ఎక్కడా లేదు. మన దగ్గరే జరిగింది. అదే చూపించా.

ఆడియన్స్ కి ఏం చెబుతారు?

ఈ సినిమా టాప్‌ సినిమా. తెలంగాణలో పుట్టిన ఓ వ్యక్తి తీసిన బెస్ట్ సినిమా అని చెబుతున్నా.