నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ

Published On: July 24, 2023   |   Posted By:

నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ

మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుందని మరోసారి రుజువు చేసింది సామజవరగమన: నిర్మాత రాజేష్ దండా

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వివాహభోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సామజవరగమన. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోన్న ఈ చిత్రం తాజాగా రూ.50కోట్ల మార్క్ ని దాటింది. రూ.50కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సామజవరగమన బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు.

ముందుగా కంగ్రాట్స్ సామజవరగమన తో మంచి విజయాన్ని అందుకున్నారు సామజవరగమన వసూళ్లు చూస్తుంటే ఎలా అనిపిస్తోంది ?
థాంక్స్ అండీ. సామజవరగమన ఇంత పెద్ద విజయం సాధించి రూ.50కోట్ల క్లబ్ లోకి వెళ్ళడం ఆశ్చర్యపరిచింది. మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుందని మరోసారి రుజువు చేసిన సినిమా సామజవరగమన.

సామజవరగమన సక్సెస్ కి ఎలాంటి అంశాలు సహకరించాయి ?
వినోదం, ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా ఇది. నువ్వు నాకు నచ్చావ్, గీత గోవిందం లాంటి స్క్రిప్ట్ అని నమ్మకం పెట్టుకున్నాం. మా నమ్మకం నిజమైయింది.

ఈ సినిమాని రీమేక్ చేసే అవకాశం ఉందా ?
అన్ని భాషల నుంచి రీమేక్ కోసం అడుగుతున్నారు. తమిళ్ లో మేమే ప్రొడక్షన్ చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ఎలా నచ్చింది ?
దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో 2020లో ఈ కథ చెప్పారు. చెప్పినప్పుడే చాలా నచ్చింది. అనిల్ గారికి కూడా కథ వినిపించాను. ఆయనకీ నచ్చింది. అలా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్ బ్యానర్ రెండు కలసి ఈ సినిమా చేశాం. ఈ ప్రాజెక్ట్ లో అనిల్ గారు ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా హెల్ప్ అయ్యాయి.

ఈ కథ మొదట శ్రీవిష్ణు గారితోనే అనుకున్నారా ?
వాస్తవానికి ఈ కథ సందీప్ కిషన్ గారితో చేయాలి. కానీ అప్పుడు ఆయన మైకేల్ తో బిజీగా వున్నారు. ఐతే మా దగ్గరికి పంపించింది సందీప్ గారే. ఈ విషయంలో క్రెడిట్ ఆయనికి దక్కుతుంది.

థియేటర్ రన్ ఎలా వుంది ?
ఇది నాలుగో వారం. నాలుగో వారంలో కూడా థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఫస్ట్ వీక్ కి సెకండ్ వీక్ థియేటర్స్ బాగా పెరిగాయి. ఒక చిన్న సినిమా ముఫ్ఫై రోజులు థియేటర్స్ లో ఆడటం చాలా పెద్ద విజయం. అలాగే యుఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ సాధించింది. ఇది కలలో కూడా ఊహించలేదు. ఇది పెద్ద విజయం. చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి ప్రిమియర్స్ చాలా హెల్ప్ అయ్యాయి.

సామజవరగమన ఇంతపెద్ద విజయం సాధిస్తుందని ముందే ఊహించారా ?
కథ విన్నప్పుడే చాలా నవ్వుకున్నాం. ఈ కథలో యూనిక్ పాయింట్ వుంది. శ్రీవిష్ణు, నరేష్ గారి ఫన్, సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ పాత్ర  ఇవన్నీ ప్రేక్షకులని అలరిస్తాయని అనుకున్నాం. మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షకులు వాటికి కనెక్ట్ అయ్యారు. సినిమా బావుంటుదని అనుకున్నాం. ఐతే ఈ స్థాయిలో నెంబర్స్ వస్తాయని మేమూ ఊహించలేదు. శ్రీవిష్ణు గారి మూడు సూపర్ హిట్ సినిమాలని కలిపితే ఈ ఒక్క సినిమాతోనే వచ్చింది.

మీ మొదటి సినిమా మారేడుమిల్లి రిజల్ట్ తృప్తిని ఇచ్చిందా ?
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చాలా నిజాయితీ గల సినిమా. కమర్షియల్ గా డబ్బులు తీసుకురాలేదు కానీ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది.

స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?
కథ విన్నప్పుడు విజువల్ గా బావుటుందనిపించేది చేయడమే కానీ ఇలాంటిది చేయాలి, అలాంటిది చేయాలనే నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు.

ఊరు పేరు భైరవకోన గురించి ?
ఊరు పేరు భైరవకోన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో చాలా పెద్ద సీజీ వర్క్ వుంది. అది పూర్తయిన వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇది హారర్ ఫాంటసీ జోనర్. మంచి యునిక్ కంటెంట్ వుంటుంది. ఎవరూ టచ్ చేయని ఒక పాయింట్ వుంది. తెలుగు, హిందీలో ఏకకాలంలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నాం.

ఇలాంటి విజయం తర్వాత పెద్ద సినిమాలు చేయాలని వుంటుందిమీ ప్రణాళికలు ఎలా వున్నాయి?
ఖచ్చితంగా పెద్ద సినిమాలు చేయాలని వుంటుంది. నరేష్ గారు హీరోగా సోలో బ్రతుకు సో బెటరు దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. అలాగే నవంబర్ నుంచి సందీప్ కిషన్ గారితో మరో సినిమా వుంటుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్