నీతో ఫస్ట్ లుక్ విడుదల

Published On: February 4, 2021   |   Posted By:
నీతో ఫస్ట్ లుక్ విడుదల
 
ట్రెండీ దర్శకుడి తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘నీతో’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల
 
రాహు’ ఫేమ్ అభిరామ్ మరియు సాత్విక రాజ్ జంటగా బాలు శర్మ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ బాణీలు సమకూరుస్తున్నారు. పృథ్వి క్రియేషన్స్ మరియు మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ కూడా కథానాయకుడు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
 
ఇద్దరు వివిధ రకాల ఆలోచనా విధానం కలిగిన యువతీ యువకులకు ప్రేమకథ గా విడుదల చేసిన మోషన్ పోస్టర్ నుండి తెలుస్తూనే ఉంది. బాక్గ్రౌండ్ స్కోర్ వినగానే మంచిగా అనిపించేలా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలకు మీ ముందుకు వస్తారని చిత్ర యూనిట్ తెలియజేసారు. 
 
నటీనటులు :
 
అభిరామ్, సాత్విక రాజ్ మరియు తదితరులు
 
చిత్ర యూనిట్:
 
దర్శకుడు : బాలు శర్మ
నిర్మాతలు : ఏ.వీ.ఆర్. స్వామి M. Sc (Ag), ఎం.ఆర్. కీర్తన
బ్యానర్  : పృథ్వి క్రియేషన్స్ మరియు మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ : సుందర్ రామ్ కృష్ణన్
సంగీతం : వివేక్ సాగర్
కాస్ట్యూమ్ డిజైనర్ : సంజన శ్రీనివాస్