PARADHA MOVIE REVIEW
పరదా మూవీ రివ్యూ
ఎమోషనల్ ఎంగేజ్మెంట్:
స్టోరీ లైన్ :
“పడతి” అనే గ్రామంలో ప్రతీ స్త్రీ పరదా కప్పుకుని తిరగాలనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఎవరైనా పొరపాటున కూడా పరదా తీసినట్టు ఋజువైతే గ్రామ దేవత జ్వాలమ్మ ఆగ్రహానికి గురి కావటమే కాక ఆత్మాహుతి చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి తరుణంలో ఆ ఊరికి చెందిన సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) పెళ్లి తను ఈశపడిన వాడితో నిశ్చయం అవుతుంది. వారి నిశ్చితార్థం రోజున పరదా లేని ఆమె ఫోటో ఓ జాతీయ మ్యాగజైన్ లో పబ్లిష్ అవుతుంది. ఊరి జనం అంతా కలిసి ఆమెను తప్పుబడతారు. పడతి సంప్రదాయాన్ని ఉల్లంఘించి ఏ తప్పు చేయలేదని ఆమె ఎంత వేడుకున్నా ఊరి ప్రెసిడెంట్ ఆత్మాహుతి జరగాల్సిందేనని తీర్మానం చేస్తాడు. ఇలాంటి పరిస్థితులలో రత్నం (సంగీత) ఆమెకు సాయం చేస్తుంది. అక్కడ నుంచి కథ మొదటి మలుపు తీసుకుంటుంది.
ఎన్నడూ పరదా తీయని సుబ్బలక్ష్మి ఫోటో మ్యాగజైన్ లో ఎలా పబ్లిష్ అయింది? అమిష్ట (దర్శన) కి సుబ్బలక్ష్మికి ఉన్న లింకు ఏంటి? గౌతం మీనన్ పాత్ర ప్రత్యేకత ఏంటి? పడతి గ్రామంలో మొదలైన కథ ధర్మశాల వరకూ ఎందుకు కొనసాగింది?
ఇత్యాది అంశాలు తెర పై చూడాల్సిందే! మొదట్లో సాధారణ రూరల్ డ్రామాగా మొదలైన కథ రోడ్ ట్రిప్ గా మారుతుంది.
ఆర్టిస్ట్ ల ఫెర్ఫార్మెన్స్ :
సుబ్బు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటనలో పరిణితి కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఎక్కువ డైలాగులు లేకున్నా హావభావాలతో చక్కగా నటించింది. హృదయం మలయాళం సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న దర్శన అమిష్ట పాత్రను సమర్థవంతంగా పోషించింది. పని చేసే చోట స్త్రీల కష్టాల గురించి ఆమె చెప్పిన డైలాగులు ఆలోచింపపజేస్తాయి. సుబ్బు కోసం భర్తను, ఇంటిని, పిల్లలను వదిలేసి వచ్చేసే రత్నం పాత్రలో సంగీత వదిగిపోయింది. తొలిసారి స్వేచ్చను పొందిన మహిళగా ఆమె నటన చాలా బావుంది. ముఖ్యంగా భర్తతో జరిగే చివరి ఫోన్ సంభాషణ తరువాత ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా అందంగా ఉన్నాయి.
టెక్నికల్ గా :
కెమెరావిమెన్ మృదుల్ సేన్ విజువల్స్ బాగున్నాయి. గోపి సుందర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి వెన్నెముక అని చెప్పచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
అనుపమ మరియు దర్శన పెర్ఫార్మెన్స్, సంగీతం, కొత్త తరహా కథాంశం
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ కాస్తా డిసప్పాయింట్ చేస్తుంది
తీర్పు : అబోవ్ యావరేజ్
బ్యానర్: ఆనంద మీడియా
నిర్మాతలు: శ్రీనివాసులు, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ
విడుదల తేదీ: 22 –08-2025
సెన్సార్ రేటింగ్: U/A
సాంకేతికవర్గం :
రచన – దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
కెమెరా: మృదుల్ సేన్
సంగీతం: గోపి సుందర్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల
రన్ టైమ్ : 2 hr 25 mins
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్