పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మూవీకి BRO టైటిల్ ఖరారు

Published On: May 19, 2023   |   Posted By:

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మూవీకి BRO టైటిల్ ఖరారు

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ చిత్రానికి BRO టైటిల్ ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. PKSDT నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. తన మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి స్క్రీన్ పంచుకుంటున్న చిత్రమిది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

PKSDT టైటిల్, ఫస్ట్ లుక్ ని మే 18న సాయంత్రం 4:14 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ క్షణం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది.ఈ సినిమాకి BRO అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు. కాలాన్ని సూచించేలా ఇంగ్లీష్ అక్షరాలతో ఎంతో అందంగా రూపొందించిన టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. ఇక ఈ బ్రో మూవీ మోషన్ పోస్టర్ అయితే కట్టిపడేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పరమేశ్వరుడి రూపం కనిపిస్తుండగా కాల త్రిగుణ సంశ్లేశం కాల గమన సంకాశం కాల వర్జయేత్ చారణం కాల జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం బ్రో బ్రోదిన జన్మలేషం బ్రో బ్రోవగ ధర్మశేషం బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం అనే శ్లోకం వినిపిస్తుండగా మెడలో ఓం లాకెట్ ధరించి స్టైలిష్ గాడ్ లా కనిపిస్తున్న కథానాయకుడు పవన్ కళ్యాణ్ రూపాన్ని పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. గీత రచయిత కళ్యాణ చక్రవర్తి సాహిత్యం అందించారు. అలాగే ఈ చిత్రాన్ని2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

బ్రో ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పట్ల సాయి ధరమ్ తేజ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. నా గురువు అయిన పవన్ కళ్యాణ్ మామతో కలిసి పనిచేయడం నా అతిపెద్ద కల అని, ఆ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి అదృష్టం దక్కినందుకు ఓ అభిమానిగా మనసులోనే నాట్యం చేస్తున్నానని తెలిపారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోంది. కార్తికేయ-2, ధమాకా వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో BRO వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో మొదటిసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం, పైగా ఇందులో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

BRO చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఇంకా పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలిన భాగంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

తారాగణం:

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ , సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా,తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్, నర్రాశ్రీను, యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్

సాంకేతికవర్గం:

రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఎడిటర్: నవీన్ నూలి