పార్కింగ్ మూవీ రివ్యూ

Published On: January 1, 2024   |   Posted By:

పార్కింగ్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఏక రాజు (ఎం ఎస్ భాస్కర్) కూకట్ పల్లి టౌన్ పంచాయతీ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తుంటాడు.(నిజాయితీ గా జాబ్ చేస్తాడు) అతనికి ఒక భార్య, ఒక కూతురితో కూకట్ పల్లి లో కిరాయి ఉంటాడు. ఏక రాజు ఇంటి పైన రూమ్ లో ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్ ) అతని భార్య (ఇందూజ రవి చంద్రన్ ) ఆతిక వాళ్ళు కిరాయి కి వస్తారు. ఆతిక ప్రెగ్నెట్ గా ఉంటుంది. ఈశ్వర్, ఆతిక ది  లవ్ మ్యారేజ్. ఈశ్వర్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా చేస్తుంటాడు. రోజు క్యాబ్ లో ఆఫీస్ కు వెళ్తుంటాడు. భార్య కోరిక మేరకు ఈశ్వర్ ఒక కార్ కొంటాడు. దాన్ని ఇంటి లోపల ఏక రాజు బైక్ పక్కన పార్క్ చేస్తుంటాడు. ఒక రోజు కార్ కు బైక్ తగిలి గీత పడటంతో ఈశ్వర్ ఏక రాజు ను ఎందుకు ఇలా చేసారు అని అడుగుతాడు. తరువాత కొన్ని రోజులకు గొడవ పెద్దది అవ్వడం తో ఏక రాజు ఒక కొత్త కార్ కొని ఇంటి లోపల పార్క్ చేస్తాడు. పార్కింగ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఈశ్వర్ ఏక రాజు ను ఎందుకు చంపాలని అనుకున్నాడు అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

పార్కింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు తెలిపే చిత్రం ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.

టెక్నికల్ గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ, స్క్రీన్ ప్లే మరియు సంబాషణలు

మైనస్ పాయింట్స్ :

కొంచెం అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుంది

నటీనటులు:

హరీష్ కళ్యాణ్, ఎంఎస్ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: పార్కింగ్ (తమిళం నుండి డబ్ చేయబడింది)
బ్యానర్: ప్యాషన్ స్టూడియో 3
దర్శకుడు: రామ్‌కుమార్ బాలకృష్ణన్
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
నిర్మాతలు : సుధన్ సుందరం, కెఎస్ సినీష్
OTT స్ట్రీమింగ్: డిస్నీ + హాట్ స్టార్
విడుదల తేదీ : 30122023
రన్‌టైమ్: 100 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్