పి.వి.నరసింహరావు బయోపిక్

Published On: June 28, 2021   |   Posted By:
పి.వి.నరసింహరావు బయోపిక్
 
ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై పి.వి.నరసింహరావు బయోపిక్
 
బహుభాషా కోవిదుడు-అసాధారణ ప్రజ్ఞా దురీణుడు,స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహరావు బయోపిక్ ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్” పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో “శ్రీశైలం” చిత్రాన్ని నిర్మించారు. 
     
పలు సూపర్ హిట్ చిత్రాల రూపకర్త,ప్రముఖ సీనియర్ దర్శకుడు ‘ధవళ సత్యం’ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 
   
“ఎన్టీఆర్ ఫిల్మ్స్” పతాకంపై తెలుగు-హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్ లో… జాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి.నరసింహరావు పాత్రను పోషించనున్నారు.
 
స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటూ అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022, జూన్ 28న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు