పొట్టేల్ మూవీ వవ్వరే పాట విడుదల

Published On: February 16, 2024   |   Posted By:

పొట్టేల్ మూవీ వవ్వరే పాట విడుదల

గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఫ్రెష్ నెస్ , హానెస్టీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్ గ్రామీణ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, మొదటి సింగిల్ నాగిరో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ లేయర్‌ని ఆవిష్కరించింది.

మ్యూజికల్ జర్నీలో భాగంగా రెండో సింగిల్ వవ్వరేతో ముందుకు వచ్చారు మేకర్స్. శేఖర్ చంద్ర స్వరపరిచిన వవ్వరే మాస్ ని కట్టిపడేసి పాట. థంపింగ్ బీట్‌లతో ఒక రూరల్ , మాస్ నంబర్‌ను స్కోర్ చేసారు. కాసర్ల శ్యామ్ తన అద్భుతమైన లిరిక్స్ తో విలేజ్ బ్యూటీ ని వర్ణించారు, ఆస్కార్విన్నింగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పవర్ ఫుల్ వాయిస్ తో ఇంపాక్ట్ పెంచాడు. యువ చంద్ర కృష్ణ పల్లెటూరి పాత్రలో పర్ఫెక్ట్ అనిపించుకున్న పాటలో తన డ్యాన్స్ స్కిల్స్ చూపించాడు.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం :

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది :

రచన, దర్శకత్వం  సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు  నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
బ్యానర్లు  నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
సంగీతం శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్  మోనిష్ భూపతి రాజు
ఎడిటర్  కార్తీక శ్రీనివాస్