పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైన ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’

Published On: March 12, 2019   |   Posted By:

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైన ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’

ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘ కృష్ణారావ్ సూపర్ మార్కెట్ ‘..ఎల్సా ఘోష్ కథానాయిక గా  పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.. లవ్ సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి శ్రీనాథ్  పులకురమ్ దర్శకత్వం వహించారు.. బి.జి.ఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్ పై గౌతమ్ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలి సంగీతం సమకూర్చగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ.విజయ్ కుమార్ డీఓపీ గా  బాధ్యతలను నిర్వర్తించారు.. వచ్చేనెలలో సినిమా ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. 

నటీనటులు : కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు…

సాంకేతిక నిపుణులు : 
ప్రొడ్యూసర్ : BGR ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్
డైరెక్టర్: శ్రీనాథ్ పులకురమ్
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : ఏ.విజయ్ కుమార్
ఎడిటర్:  మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్: బోలె షావలి 
ఫైట్స్ : సింధూరం సతీష్
ఆర్ట్: ఎమ్.ఎస్.వాసు
ప్రాజెక్ట్ అడ్వైజర్ : కే.  భువన్ రెడ్డి.