ప్రముఖ నిర్మాత సూర్య నారాయణ గారి సంతాప సభ

Published On: January 23, 2023   |   Posted By:

ప్రముఖ నిర్మాత సూర్య నారాయణ గారి సంతాప సభ

తెలుగునిర్మాతల మండలి , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ నిర్మాత సూర్య నారాయణ గారి సంతాప సభ

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వరుసగా అగ్ర నటులు, నిర్మాతలు చనిపోతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజ్, కైకాల సత్య నారాయణ, చలపతి రావు వంటి ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ నిర్మాత ఎ. సూర్య నారాయణ గారు ఆనారోగ్య కారణాలతో చనిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన అడివి రాముడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సూర్య నారాయణ గారు నిర్మాతగా వ్యవహరించారు. సూర్య నారాయణ సంతాప సభను ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతల మండలి , ఛాంబర్ ఆఫ్ కామర్స్ , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంతాప సభకు ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్ గారు, కె.ఎస్ రామారావు గారు, ప్రసన్న కుమార్ గారు తో పాటు దామోదర్ ప్రసాద్, భరద్వాజ తమ్మారెడ్డి, నిర్మాత నహీం, శివ రామ్ కృష్ణ తో పాటు పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య నారాయణ గారికి నివాళ్లు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ గారు మాట్లాడారు. సూర్య నారాయణ గారితో నాకు ఉన్న బంధం 30 ఏళ్లు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే అది సూర్య నారాయణ గారు పెట్టిన భిక్షే. నేను సినిమాలు మాత్రమే చేస్తున్న క్రమంలో నాకు ఇష్టం లేకపోయినా, నాతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారు. అప్పుడు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉండకపోతే, ఈ రోజు నేను అప్పుల్లో ఉండేవాడిని, ఇన్ని సినిమాలు చేసే వాడిని కూడా కాదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ కంట్రవర్సీ బారీన పడుతారు. కానీ, సూర్య నారాయణ గారు ఒక్క సారి కూడా కంట్రవర్సీలో లేరు. అందరితోనూ గారు అని పిలుపించుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అందులో మొదటి వ్యక్తి సూర్య నారాయణగారు. సూర్య నారాయణ గారు కానీ లేకపోతే సినీ టవర్స్ లేదు. అలాంటి మంచి వ్యక్తి, పది మంది కావాలి అని అనుకునే వ్యక్తి ఈ రోజు లేక పోవడం నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు.

ఈ సందర్భంగా కె.ఎస్ రామారావు గారు మాట్లాడారు. 70 దశకంలోని చలన చిత్ర పరిశ్రమ ముఖ్యలు అందరూ మన మధ్య నిష్క్రమించడం చాలా దురద్రుష్టకరం. కృష్ణ గారు, కైకాల సత్య నారాయణ గారు, చలపతి రావు గారు ఇప్పుడు నిర్మాత సూర్య నారాయణ గారు మన మధ్య లేకపోవడం బాధకరం. లెజండరీ నటుడు ఎన్టీఆర్ గారికి అడివి రాముడు వంటి హిట్ ఇచ్చారు. ఇది సీనియర్ ఎన్టీఆర్ గారికి కమ్ బ్యాంక్ ఫిల్మ్ లాంటింది. అడివి రాముడు తెలుగు ఇండస్ట్రీకే అతి ముఖ్యమైన సినిమా. అలాంటి సినిమాను సూర్య నారాయణ గారు నిర్మించారు. సూర్య నారాయణ గారు అప్పటి నుంచే నాకు పరిచయం. ఆ సినిమాకి నేను రెడియో పబ్లిసిటీకి వెళ్లినప్పుడు ఆయన పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో అనేక సార్లు కలిసి పని చేశాను. 2023 మళ్లీ ఇలాంటి సంతాప సభలు లేకుండా ఉండాలని, ఇండస్ట్రీలో పెద్దలు ఇంకా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.

ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు. ఫిల్మ్ ఛాంబర్ కి ఉన్న ప్రతి ఇటుకలో సూర్య నారాయణ గారి భాగస్వామ్యం ఉంది. ఛాంబర్ నిర్మాణం కోసం చాలా కష్టపడ్డారు. ఇండస్ట్రీకి ఇంకా ఏం చేయాలి అంటూ నిత్యం ఆలోచించే వ్యక్తి సూర్య నారాయణ గారు. ఆయన అడివి రాముడు సినిమా చేశాడు. ఆ సినిమా ఆ రోజుల్లో అత్యధిక కలెక్షన్లు తీసుకువచ్చింది. అలాంటి సూర్య నారాయణ గారు లేకపోవడం చాలా బాధకరం.

ఈ సంతాప సభలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, భరద్వాజ తమ్మారెడ్డి, నిర్మాత నహీం, శివ రామ్ కృష్ణ తో పాటు పలువరు ప్రముఖులు పాల్గొన్నారు.