ఫేక్ న్యూస్ వెబ్సైట్స్ పై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి

Published On: May 6, 2020   |   Posted By:
ఫేక్ న్యూస్ వెబ్సైట్స్ పై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి
 
 
ఫేక్ న్యూస్ రాసే వెబ్సైట్స్ పైన పిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము – తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి

హీరో విజయ్ దేవరకొండ తెలుగులో వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష్య పెట్టుకుని రాస్తున్నారంటూ మండిపడ్డాడు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై మాట్లాడిన తరువాత చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ తదితరులు విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫేక్ న్యూస్, ఫేక్ వెబ్సైట్స్ ను ఖండిస్తోంది. అసత్యంగా వార్తలు రాసే వెబ్ సైట్స్ ను వ్యతిరేకిస్తోంది. హీరోలు దర్శకులు విజయ్ దేవరకొండకు సపోర్ట్ చెయ్యడాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సమర్థిస్తుంది. ఒక మనిషి తన స్థోమతకు తగ్గట్లు సహాయం చేస్తాడు, దానిపై కూడా కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు. సినిమా యాడ్స్ వలన రెవిన్యూ పొందుతూ ఇలా సినిమా వారిపైన గ్రేట్ ఆంధ్ర నెగుటీవ్ ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు, ఈ విషయం పై లాక్ డౌన్ పూర్తి తరువాత అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము, ఎవరికైనా ఫేక్ న్యూస్ రాసే వెబ్సైట్స్ పైన పిర్యాదు చేస్తే మేము చర్యలు తీసుకుంటామని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది.