బిహైండ్ సమ్‌వన్ చిత్రం షూటింగ్ పూర్తి

Published On: July 21, 2021   |   Posted By:

బిహైండ్ సమ్‌వన్ చిత్రం షూటింగ్ పూర్తి

 

ఎస్. ఎస్. బ్రదర్స్ సమర్పణలో కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు హీరోహీరోయిన్లుగా నిర్మాత సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘‘బిహైండ్ సమ్‌వన్’’. ఈ చిత్రంతో అజయ్ నాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం గోవా లో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ నాలి మాట్లాడుతూ.. ‘‘సరికొత్త పాయింట్‌తో నేనీ కథను రాసుకున్నాను. నా కథ విన్న వెంటనే.. సినిమాని నిర్మిస్తానని సునీల్ కుమార్ సింగ్‌గారు ముందుకు రావడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. నూతన నిర్మాత అయినా బడ్జెట్ విషయంలో వెనుకాడకుండా సినిమా అద్భుతంగా రావడానికి సపోర్ట్ చేశారు. ఆయనకి చెప్పడానికి నా దృష్టిలో థ్యాంక్స్ అనే పదం సరిపోదు. ఆర్టిస్ట్‌లందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సుమన్ గారు ఓ కీలక పాత్రలో నటించారు. ప్రేక్షకులను ఈ చిత్రం సరికొత్తగా థ్రిల్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ‘‘సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాలని అనుకున్న తర్వాత ఎన్నో కథలు విన్నాం. కానీ అజయ్ నాలి చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథతోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సినిమాలో యూత్‌కి కావాల్సిన అంశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కథ మీద ఉన్న నమ్మకంతో తెలుగు, హిందీ భాషలలో నిర్మించాం. తమిళం, మలయాళం, కన్నడ భాషలలోకి అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు.

రాజ్ సూర్యన్, నివిక్షనాయుడు, సుమన్, అజయ్, రవిబాబు, సహార కృష్ణన్, సూర్య(పింగ్ పాంగ్), అభి, సమీర్, ఫిరోజ్, సిద్ధ, వినయ్, ప్రియ, పండుగాయల వెంకటసుబ్బయ్య, దండు వెంకటసుబ్బయ్య, సింగవరం సురేష్ కుమార్ సింగ్, భూమిరెడ్డి శ్రీనివాసులు తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా: ఆనెం వెంకట్
ఆర్ట్: నాని అండ్ హర్ష
సంగీతం: విజయ్ కూరాకుల
ఎడిటింగ్: క్రాంతి
నిర్మాత: సింగవరం సునీల్ కుమార్ సింగ్
కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అజయ్ నాలి