బేబీ మూవీ రివ్యూ

Published On: July 14, 2023   |   Posted By:

బేబీ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

కథ ఏంటి అంటే :

ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) మరియు వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఒకే బస్తి లో ఉంటారు. చిన్నపటినుంచి వైష్ణవికి ఆనంద్ అంటే ఇష్టం ఒక రోజు తనకు ప్రపోజ్ చేస్తుంది దానికి ఆనంద్ కూడా అంగీకరిస్తాడు. వీరి ఇద్దరి మధ్య మొదటి ప్రేమ కావడంతో ఆ బంధం చాలా గట్టిగా ఉంటుంది. అయితే స్కూల్ లో పదోవతరగతి తప్పిన ఆనంద్ ఆటో నడుపుతూ స్థిరపడిపోతాడు. వైష్ణవి మాత్రం తన చదువు కంటిన్యూ చేస్తూ ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంది. కాలేజీ లో జాయిన్ అయినా వైష్ణవి అక్కడ ఉన్న కల్చర్ కారణంగా మెల్ల మెల్లగా తనలో మార్పులు వస్తాయి. బస్తి పిల్ల కాస్త చాలా పోష్ పోరి లాగా తయారవుతుంది. అదే కాలేజీ లో చదువుతున్నా విరాజ్ (విరాజ్ అశ్విన్), వైష్ణవిని ఇష్టపడతాడు. తను కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా దగ్గరవుతుంది. కొన్ని కారణాల వలన వైష్ణవి విరాజ్ కు చాలా దగ్గర అవుతుంది. ఒక పార్టీ లో వైష్ణవి తాగిన మత్తు లో తను కిస్ చేయడం వలన విరాజ్ దానిని సీరియస్ గా తీసుకొని తనతో ప్రేమలో పడతాడు. ఆ తరవాత జరిగినా మార్పులు ఆ ముగ్గురు ఆనంద్ మరియు వైష్ణవి, విరాజ్ ల మధ్య నలిగినా ఈ ట్రయాంగల్ ప్రేమాయణం పూర్తిగా చూడాలనుకుంటే థియేటర్ కి వెళ్లాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

హీరోయిన్ వైష్ణవి యాక్టింగ్ చాలా కీ రోల్ పోషించింది.
మిగిలిన నటీనటులంతా కూడా పాస్ మార్క్స్ మాత్రమే క్రాస్ చేయగలిగారు.
సినిమాటోగ్రఫీ కమర్షియల్ గా అద్భుతంగా చిత్రీకరించారు.
పాటలు బాగా ఉన్నాయి

మైనస్ పాయింట్స్ :

కథనం బాగా లాగ్ అనిపించింది.
పర్టిక్యూలర్ గా సెకండ్ హాఫ్ కొంచెం మెల్లగా సాగింది.

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్

సినిమా వివరాలు :

సినిమా టైటిల్: బేబీ
బ్యానర్: మాస్ మూవీ మేకర్స్
విడుదల తేదీ:-14-07-2023
సెన్సార్ రేటింగ్: U/A
దర్శకుడు : సాయి రాజేష్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి
ఎడిటింగ్: విప్లవ్ నిషాదన్
నిర్మాత: SKN
రన్‌టైమ్: 171 నిమిషాలు

మూవీ రివ్యూ రైటర్ : రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్