భాగ్ సాలె మూవీ రివ్యూ

Published On: July 7, 2023   |   Posted By:

భాగ్ సాలె మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

శ్రీ సింహ (హీరో) ఒక మధ్య తరగతి అబ్బాయి, నేహా సోలంకి (హీరోయిన్) ఒక డబ్బు ఉన్న అమ్మాయి.
శ్రీ సింహ ఒక రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తుంటాడు. శ్రీ సింహ నేహా ను డబ్బున్న అబ్బాయిగా పరిచయం చేసుకుని ప్రేమాయణం సాగిస్తుంటాడు.

హీరో నాన్న గా రాజీవ్ కనకాల. అమ్మ గా బిందు చంద్ర మౌళి, నేహా సోలంకి (హీరోయిన్) డాడీ గా సంజయ్ స్వరూప్, విజయ్ జాన్ విలన్ లవర్ గా నళిని (నందిని రాయ్) నటిస్తారు. జాన్ విజయ్ దగ్గర బావ మరిది గా వైవా హర్ష. శ్రీ సింహ ఫ్రెండ్ గా సుదర్శన్ నటించారు.

కోహినూర్ వజ్రం లోని ఒక ముక్క నేహా సోలంకి (హీరోయిన్) వాళ్ళ తాత దగ్గర ఉంటుంది దానిని నేహా వాళ్ళ తాత ఒక ఉంగరం చేయించు కుంటాడు. ఆ ఉంగరం తరతరాలుగా మారి (హీరోయిన్ డాడీ) సంజయ్ స్వరూప్ దగ్గరికి వస్తుంది. దానిని తీసుకుంటే కోటీశ్వరులు అవుతారు అని నమ్మి విలన్ జాన్ విజయ్ అందరి దగ్గర ఎంక్వయిరీ చేసి చివరకు సంజయ్ స్వరూప్ దగ్గరికి వచ్చి అతన్ని వేదిస్తాడు.

కథలో ఉంగరం వేరే వేరే వాళ్ళ దగ్గరి నుండి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్లడం తో కొంత స్టోరీ రన్ అవుతుంది.
దాంతో శ్రీ సింహ ఆ ఉంగరాన్ని క్లైమాక్స్ లో నేహాకి ఇచ్చి నేను మిడిల్ క్లాస్ వాణ్ని అని చెప్పడటం తో సినిమా అయిపోతుంది.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

హీరో, హీరోయిన్ పెర్ఫార్మన్స్ యావరేజ్.
హీరో ఫ్రెండ్ గా సుదర్శన్ పెర్ఫార్మన్స్ జస్ట్ ఓకే
విలన్ గా జాన్ విజయ్ పెర్ఫార్మన్స్ ఓకే

మైనస్ లు :

టైమింగ్ లేని పాటలు, పేలని కామెడీ పంచులు

నటీనటులు:

శ్రీ సింహ కోడూరి, నేహా సోలంకి

సాంకేతికవర్గం :

బ్యానర్: వేదాంష్ క్రియేటివ్ వర్క్స్
కథ – దర్శకత్వం: ప్రణీత్ సాయి
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: రమేష్ కుశేందర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, సింగనమల కళ్యాణ్
రన్‌టైమ్: 120 నిమిషాలు
విడుదల తేదీ : జులై 7, 2023