మార్టిన్ లూథర్ కింగ్ మూవీ రివ్యూ

Published On: October 31, 2023   |   Posted By:

మార్టిన్ లూథర్ కింగ్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

పడమరపాడు అనే గ్రామం లో జరిగే కథ ఇది. ఊరికి ఉత్తరం వైపు ఒక కులం, దక్షిణం వైపు ఇంకో కులం వాళ్ళు ఉంటారు. ఈ రెండు కులాలకు అస్సలు పడదు. ఆ ఊరి ప్రెసిడెంట్ రెండు కులాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుని ఉత్తరం దక్షిణం వాళ్లకు సమ ప్రాధాన్యత ఇస్తాడు. కానీ పెద్ద భార్య కొడుకు జగ్గు (నరేష్ ), చిన్న భార్య కొడుకు లోకి (వెంకటేష్ మహా ) ఎప్పుడు గొడవ పడుతుంటారు. వీళ్లిద్దరి కారణంగా అందరు ఇబ్బంది పడుతుంటారు.

ఇలా ఉండగా ఆ ఊర్లోకి ఒక పెద్ద ఫ్యాక్టరీ వస్తుందని, అది వస్తే కోట్లల్లో కమిషన్ వస్తుందని తెలిసి జగ్గు, లోకి ఇద్దరు ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తారు. ఉత్తరం, దక్షిణం వాళ్ళు సమానంగా ఉండటం తో ఒక్క ఓటు ఎవరికీ వస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ ఒక్క ఓటు స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్ (సంపూర్ణేష్ బాబు ). అతను ఒక అనాధ చెట్టు కింద చెప్పులు కొట్టుకునే అతను . అతనికి పేరు లేదు, ఓటర్ కార్డు ఏది లేదు. ఆ ఉరికి కి కొత్తగా వచ్చిన పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి వసంత (శరణ్య ) అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టి, పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరిపిస్తుంది. అతని ఓటు కీలకం కావడం తో జగ్గు, లోకి మార్టిన్ లూథర్ కు కావాల్సినవి అన్నీ ఇస్తారు. ఆ ఓటు ను అడ్డుపెట్టుకుని మార్టిన్ ఏమి చేసాడు? ఈ క్రమం లో అతనికి ఎదురైనా సమస్యలు ఏంటి ? అనేది సినిమా లో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

ఓటు ప్రాధాన్యత ను తెలియజేసే సినిమా ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

సంపూర్ణేష్ బాబు, డాక్టర్ వికె నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ బాగుంది

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది, కొన్ని సీన్లు సరిగ్గా లేవు, కామెడీ కొన్ని చోట్ల పండలేదు

నటీనటులు:

సంపూర్ణేష్ బాబు, డాక్టర్ వికె నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: మార్టిన్ లూథర్ కింగ్
బ్యానర్: YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ : 27-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: పూజ కొల్లూరు
సంగీతం: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ: దీపక్ యరగేర
ఎడిటర్: పూజ కొల్లూరు
నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
రన్‌టైమ్: 146 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్