మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

Published On: August 14, 2023   |   Posted By:

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా నుంచి ఉల్టా పల్టా సాంగ్ లాంఛ్

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ పతాకంపై దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఉల్టా పల్టా సాంగ్ ను మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో

దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ  ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసేందుకు నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్నాను. ఏం చేసినా మనం వైఫ్ కు హెల్ప్ చేయగలం కానీ మనం ఆ బాధను తీసుకోలేం. మా పాప పుట్టినప్పుడు ఆమెను నా చేతికి ఇచ్చారు డాక్టర్స్. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. అలాంటి అమ్మతనం అనే బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా. ఇదొక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా వెకిలిగా, పిచ్చి కామెడీ చేశారని అంటారు. అందుకే చాలా జాగ్రత్తగా, కత్తి మీద సాములా రూపొందించాం. సోహైల్, రూపా పోటీ పడి ఫర్ ఫార్మ్ చేశారు. సోహైల్ కు ఎంత పేరొస్తుందో, రూపకు కూడా అంతే మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కదిలించే ఎమోషన్ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా, లవర్స్ అయినా కలిసి చూసేలా ఉంటుంది. అన్నారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ  దర్శకుడు శ్రీనివాస్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. కొద్ది సేపటికి ఇంకో కథ ఉంది వింటావా అన్నారు. నేను మిస్టర్ ప్రెగ్నెంట్ కథే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇవాళ ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మా సినిమా కూడా వాళ్లకు అలాంటి అనుభూతి అందిస్తుందని నమ్మాను. ఈ సినిమా కోసం 15 రోజులు వర్క్ షాప్స్ చేశాం. రియల్ గా ప్రెగ్నెన్సీ అంత బరువుండే ప్రోత్సటిక్స్ వాడాము. ఈ సినిమా మొదలైన కొత్తలో కొన్న ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ఎక్కడా ప్రెగ్నెన్సీ మీద కామెడీ డైలాగ్స్ పెట్టలేదు. హుందాగా ఒక కథను తెరకెక్కించాం. సినిమా చూశాక మీ సిస్టర్స్, మదర్ ను హగ్ చేసుకుంటారు. ఈ సినిమా ఒప్పుకున్న టైమ్ లో మా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్స్ గా ఉన్నారు. వాళ్లను చూస్తూ ప్రెగ్నెంట్ వుమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఇకపై కూడా ఇలాంటి డెఫరెంట్ మూవీస్ చేస్తాను. అన్నారు.

హీరోయిన్ రూపా కొడవయూర్ మాట్లాడుతూ  మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో ఎంత ఫన్ ఉంటుందో అంత ఎమోషన్ ఉంటుంది. ఇదొక బ్యూటిఫుల్ మూవీ. ఇందులో నటించినందుకు సంతోషంగా ఉంది. మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా కథ విన్నప్పుడు వీళ్లు సరిగ్గా మూవీని క్యారీ చేయగలరా అనుకున్నాను కానీ షూటింగ్ చేస్తుంటే దర్శకుడు శ్రీనివాస్ గారికి ఉన్న క్లారిటీ, సోహైల్ డెడికేషన్ ఇవన్నీ చూసి ఇదొక మంచి మూవీ అవుతుందని నమ్మకం ఏర్పడింది. నేనొక డాక్టర్ ని, ఆ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే సినిమాలు చేస్తాను. అని చెప్పింది

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ  ట్రైలర్ రిలీజైన కొద్ది రోజుల్లోనే అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. చిన్న సినిమాగా మొదలై..ట్రేడ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది మిస్టర్ ప్రెగ్నెంట్. ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో ఈ మూవీని నిర్మించాం. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాను చూశారు. ఒక మంచి సినిమా చేశారని అప్రిషియేట్ చేశారు. ఇంట్లో సోదరి, తల్లితో కలిసి ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నా. తెలుగులో ఇలాంటి డిఫరెంట్ మూవీ చేసిన క్రెడిట్ మా సంస్థకు దక్కుతుంది. డైరెక్టర్ శ్రీనివాస్ ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించింది. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి వుమెన్స్ ను కూర్చోబెట్టి డైరెక్టర్ తో ఈ కథ చెప్పించాను. వాళ్లంతా చాలా బాగుంది ఈ సినిమా చేయమని సజెస్ట్ చేశారు. అలా సినిమా మొదలుపెట్టాం. మా సినిమాను చూసి మైత్రీ లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మైత్రీ వారికి థాంక్స్ చెబుతున్నా. లేడీస్ ఆదరిస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మైత్రీ డిస్ట్రిబ్యూషన్ వాళ్లు చెప్పారు. అన్నారు.

నిర్మాత వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ  మా సంస్థలో వస్తున్న మరొక డిఫరెంట్ మూవీ ఇది. స్టోరీ సెలెక్షన్ అంతా అన్నయ్య అప్పిరెడ్డి చూసుకుంటారు. నేను యూఎస్ లో ఉన్నా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మూవీ గురించి మాట్లాడుతుంటాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చుతుంది. యూఎస్ లో దాదాపు 100 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

నిర్మాత రవీందర్ రెడ్డి సజ్జల మాట్లాడుతూ  అప్పిరెడ్డి కథ విని బాగుందని చెప్పారు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంది. సో ఆయనకు నచ్చింది. అప్పిరెడ్డి జడ్జిమెంట్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం. అన్నారు.