మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

Published On: January 23, 2024   |   Posted By:

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

లావణ్య త్రిపాఠీ, అభిజీత్, హాట్ స్టార్ స్పెషల్స్ మిస్ పర్ఫెక్ట్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ఫిబ్రవరి 2నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మిస్ పర్ఫెక్ట్ స్ట్రీమింగ్

సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు అందిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్..మిస్ పర్ఫెక్ట్ అనే మరో సరికొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటించారు. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మిస్ పర్ఫెక్ట్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

రైటర్ ఫ్రాన్సిస్ థామస్ మాట్లాడుతూ ఒక చిన్న షార్ట్ ఫిలింగా మిస్ పర్ఫెక్ట్ మొదలైంది. సుప్రియ గారు ప్రాజెక్ట్ లోకి రావడం, హాట్ స్టార్ కు రీచ్ అవడం…అలా బిగ్ సిరీస్ గా మారిపోయింది. మేము రాసిన స్క్రిప్ట్ కు చిన్న చిన్న ఛేంజెస్ చేశారు. కానీ అవన్నీ బాగున్నాయి. డైరెక్టర్ విశ్వక్ కు థ్యాంక్స్. మిస్ పర్ఫెక్ట్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. అన్నారు

రైటర్ శృతి రామచంద్రన్ మాట్లాడుతూ మిస్ పర్ఫెక్ట్ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మాకు బాగా నచ్చాయి. హ్యూమర్, డిఫరెంట్ క్యారెక్టర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ప్రేక్షకులకు మా సిరీస్ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

ఎడిటర్ రవితేజ గిరిజాల మాట్లాడుతూ మిస్ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కు పనిచేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ విశ్వక్ గారికి థ్యాంక్స్. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, హాట్ స్టార్ టీమ్, అభిజీత్, లావణ్య ఇతర యూనిట్ మెంబర్స్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఆదిత్య జవ్వాది మాట్లాడుతూ ఇదొక ఎంటర్ టైనింగ్ సిరీస్. ఈ ప్రాజెక్ట్ కు వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ మీద వెళ్లే స్క్రిప్ట్ ఇది. అభిజీత్, లావణ్య, ఝాన్సీ..వంటి వాళ్లంతా ఆకట్టుకునేలా నటించారు. మిస్ పర్ఫెక్ట్ చూస్తున్నంతసేపు మన లైఫ్ లో జరిగే కొన్ని ఫన్ ఈవెంట్స్ గుర్తుకువస్తాయి. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే వెబ్ సిరీస్ ఇది. అన్నారు

క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆధిప్ అయ్యర్ మాట్లాడుతూ శృతి, ఫ్రాన్సిస్ తీసుకొచ్చిన మంచి స్క్రిప్ట్ ను సుప్రియ గారు నమ్మి హాట్ స్టార్ ను అప్రోచ్ అయ్యారు. హాట్ స్టార్ లో అను ఈ స్క్రిప్ట్ చూడగానే ఇది మన లైఫ్ కు దగ్గరగా ఉందని టేకప్ చేశారు. అలా మిస్ పర్ఫెక్ట్ టేకాఫ్ అయ్యింది. లావణ్యకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆమె ఏం చెబుతుందో అని టెన్షన్ పడ్డాను. అభిజీత్ , అభిజ్ఞ ..వీళ్లందరి పర్ ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నా. అన్నారు

నటి ఝాన్సీ మాట్లాడుతూ రైటర్స్ మమ్మల్ని వివిధ రకాల పాత్రల్లో ఊహించుకుని, ఆ అవకాశాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తుంటాం. అలా విశ్వక్ నాకు ఈ వెబ్ సిరీస్ లో రాజ్యలక్ష్మి అనే క్యారెక్టర్ ఇచ్చారు. రాజ్యలక్ష్మి స్క్రీన్ మీద ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో..మీకు అంత ఫన్ గా అనిపిస్తుంటుంది. ఇదొక గుడ్ వెబ్ సిరీస్. మిస్ పర్ఫెక్ట్ హాట్ స్టార్ లో చూసి మీ రెస్పాన్స్ తెలియజేయండి. అన్నారు.

నటి అభిజ్ఞ మాట్లాడుతూ మిస్ పర్ఫెక్ట్ లావణ్యకు ఒక ఓసీడీ ఉంటుంది. ఆ ఓసీడీ వల్ల ఆమె ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంది. వాటి చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఆ పరిస్థితుల్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి…అనే పాయింట్స్ ను ఈ సిరీస్ లో చాలా ఎంటర్ టైనింగ్ గా చూపించారు. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్ ను ఆడియెన్స్ అందరికీ నచ్చేలా స్క్రిప్ట్ రాసిన రైటర్స్ శృతి, ఫ్రాన్సిస్ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ విశ్వక్, అండ్ మా టీమ్ అందరికీ థ్యాంక్స్. టీజర్ రిలీజ్ అయ్యాక చాలా కామెంబ్స్ అభి, అభి అని వచ్చాయి. నా గురించి ఇన్ని కామెంట్సా అనుకున్నా..కానీ అవి అభిజీత్ గురించి అని తెలిసి సర్ ప్రైజ్ అయ్యా. అలాగే లావణ్య, ఝాన్సీ, హర్ష గారు..ఇలా టీమ్ అందరితో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశా. అన్నపూర్ణ సంస్థ, సుప్రియ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను మీరు కంప్లీట్ గా చూశాక కూడా మళ్లీ రివైండ్ చేసి మీకు నచ్చిన సీన్స్ రిపీటెడ్ గా చూస్తారు. అని చెప్పింది.

యాక్టర్ మహేశ్ విట్టా మాట్లాడుతూ నటుడిగా కొన్నే గుర్తు పెట్టుకునే క్యారెక్టర్స్ లభిస్తుంటాయి. అలా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ నాకు మిస్ పర్ఫెక్ట్ తో ఇచ్చిన డైరెక్టర్ విశ్వక్ గారికి థ్యాంక్స్. ఈ సిరీస్ లో సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ లో నేను మీకు కనిపిస్తా. ఈ క్యారెక్టర్ చేసేందుకు కొందరు సెక్యూరిటీ గార్డులను సీక్రెట్ గా గమనించాను. మిస్ పర్ఫెక్ట్ ఒక మంచి వెబ్ సిరీస్ గా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

యాక్టర్ రోషన్ మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ విశ్వక్ అన్నకు థ్యాంక్స్ చెబుతున్నా. మిస్ పర్ఫెక్ట్ ఒక ఫన్ రైడ్ లాంటి వెబ్ సిరీస్. మేము వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు కూడా మీరంతా అలాగే సంతోషిస్తారు. అన్నారు.

యాక్టర్ కేశవ్ మాట్లాడుతూ అన్నపూర్ణ సంస్థ మా హోం బ్యానర్ లాంటిది. ఈ సంస్థలో వ్యూహం, లూజర్ చేశాను. ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ లో నటించాను. అలాగే హాట్ స్టార్ లో అతిథి సిరీస్ కు వర్క్ చేశాను. మిస్ పర్ఫెక్ట్ ఒక ఎంటర్ టైనింగ్ వెబ్ సిరీస్. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.

డైరెక్టర్ విశ్వక్ ఖండేరావ్ మాట్లాడుతూ నేను ఈ సిరీస్ డైరెక్టర్ గా మారడానికి ఫస్ట్ రీజన్ అధీప్. తనే రైటర్స్ కు పరిచయం దగ్గర నుంచి ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యేవరకు టీమ్ సెట్ చేశారు. అభిజీత్ మెయిన్ రోల్ చేస్తున్నారు అన్నప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. నేను బిగ్ బాస్ చూడలేదు కానీ అభిజీత్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మరికొన్ని ప్రాజెక్ట్స్ చూశాను. తను ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకున్నా..ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇచ్చాడు. లావణ్య గారు మిస్ పర్పెక్ట్ లీడ్ రోల్ చేస్తున్నారు అన్నప్పుడు నేను అందాల రాక్షసి మూవీలో తన పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో అలాంటి పర్ ఫార్మెన్స్ తీసుకురావాలని అనుకున్నాను. స్క్రిప్ట్ లో ఛేంజెస్ ఉంటే రైటర్స్ బాగా సపోర్ట్ చేశారు. అలాగే షూటింగ్ టైమ్ సరదాగా గడిచింది. ఝాన్సీ, హర్ష గారు ఉన్న షెడ్యూల్స్ అన్నీ ఫన్నీగా ఉండేవి. మిస్ పర్ఫెక్ట్ మంచి ఎంటర్ టైనర్. హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.

నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం అంటే నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం. అందుకే అన్నపూర్ణ సంస్థ పెట్టారు. ఈ సంస్థలో చాలా మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చారు. న్యూ టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడమే ఈ సంస్థ ఉద్దేశం. మిస్ పర్ఫెక్ట్ సిరీస్ తో మేము అదే ప్రయత్నం చేశాం. ఈ జర్నీలో హాట్ స్టార్ చాలా సపోర్ట్ చేసింది. అనురాధ, ఉదయ్ మాకు ఏ సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేసేవారు. ఈ సిరీస్ కోసం చాలా మంది అమ్మాయిలు నో చెప్పిన క్యారెక్టర్ చేస్తానంటూ ముందుకు వచ్చి తన గట్స్ ఎంటో ప్రూవ్ చేసింది అభిజ్ఞ. బిగ్ బాస్ తో అభిజీత్ తెచ్చుకున్న గుర్తింపు మీకు తెలుసు. ఇందులో తను బాగా పర్ ఫార్మ్ చేశాడు. సోగ్గాడే చిన్ని నాయన టైమ్ నుంచి లావణ్యతో నాకు మంచి స్నేహం ఉంది. మిస్ పర్పెక్ట్ కు తనే పర్పెక్ట్ అనిపించింది. ఒక చిన్న కథలో బలమైన క్యారెక్టర్స్ ఉండి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 2న మిస్ పర్ఫెక్ట్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున మా సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్పెక్ట్. సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మిసెస్ పర్పెక్ట్ అయ్యాను. ఈ సిరీస్ కు ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ కు స్ట్రెస్ ఫీలయ్యాను. అలాంటి టైమ్ లో మిస్ పర్ఫెక్ట్ లాంటి ఒక స్క్రిప్ట్ దొరకడం రిలీఫ్ లా ఫీలయ్యాను. శృతి, ఫ్రాన్సిస్ మీ ఇద్దరు సూపర్బ్ స్క్రిప్ట్ ఇచ్చారు. చదువుతున్నంత సేపు ఎంజాయ్ చేశాను. సుప్రియ గారితో సోగ్గాడే చిన్ని నాయన మూవీకి వర్క్ చేశాను. ఆ సినిమా హిట్టయ్యింది. ఈ సిరీస్ కూడా అలాగే బిగ్ సక్సెస్ కావాలి. నాకు హాట్ స్టార్ అంటే చాలా ఇష్టం. సిరీస్, మూవీస్ చూస్తుంటాను. అభిజీత్ ను కూల్ స్టార్ అని పిలుచుకోవచ్చు. నువ్వు బాగా నటించావు అని చెబితే..నిజమా అని అడుగుతాడు. మా డైరెక్టర్ విశ్వక్ ఒక మిస్టర్ పర్పెక్ట్. డైలాగ్స్ సరిగ్గా చెప్పని సీన్స్ ఎన్నిసార్లైనా టేక్స్ చేయిస్తారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. అభిజ్ఞ మంచి నటి. ఈ సిరీస్ లో తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. టైటిల్ కు తగినట్లే మా మిస్ పర్ఫెక్ట్ పర్పెక్ట్ గా ఉంటుంది. హాట్ స్టార్ లో తప్పకచూడండి. అన్నారు

హీరో అభిజీత్ మాట్లాడుతూ ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట అభిజీత్ ముహూర్తంలో చేశారు. నా లైఫ్ లో ఇది మర్చిపోలేని సందర్భం అనుకుంటా. ఈ సిరీస్ గురించి చెప్పాలంటే అన్నపూర్ణ సంస్థలో పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. అధీప్ నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఎక్కువ టైమ్ తీసుకోలేదు. తప్పకుండా చేస్తాను అన్నాను. అంత బాగా స్క్రిప్ట్ నచ్చింది. మా డైరెక్టర్ విశ్వక్ కు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ లో ఆడిషన్ ఇచ్చాను. ఆయన ఎంత పర్పెక్ట్ అంటే…ఏ సీన్ నచ్చకున్నా బాగా లేదని చెప్పడు. బాగుంది కానీ ఇంకో టేక్ చేద్దాం అంటాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వర్క్ చేయించుకున్నారు. లావణ్య గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ రైటర్స్ శృతి, ఫ్రాన్సిస్ ను ఇప్పటికి కలుసుకోవడం హ్యాపీగా ఉంది. మీరు ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ ఇచ్చారు. మిస్ పర్ఫెక్ట్ ట్రైలర్ చూశాక…ప్రతి ఆర్టిస్ట్ బాగా పర్ ఫార్మ్ చేశారు. వారి పర్ ఫార్మెన్స్ లో నేను కనిపించకుండా పోతున్నానని అనిపించింది. నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఉండాలి, ఉంటున్నాను అంటే కారణం నా ఫ్యాన్స్. వాళ్లు నా ఫ్యామిలీ. వాళ్లందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.